Begin typing your search above and press return to search.

భారీగా పెరుగుతున్న ఫ్లైట్ ఛార్జీలపై ప్యానెల్ కీలక సూచనలు

అంతకంతకూ పెరుగుతున్న విమాన ఛార్జీల ధరలపై ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది

By:  Tupaki Desk   |   11 Feb 2024 1:30 PM GMT
భారీగా పెరుగుతున్న ఫ్లైట్ ఛార్జీలపై ప్యానెల్ కీలక సూచనలు
X

అంతకంతకూ పెరుగుతున్న విమాన ఛార్జీల ధరలపై ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా పండుగలు.. సెలవుల్లో విమాన ఛార్జీల ధరలు అనూహ్య రీతిలో పెరిగిపోతుండటంతో పాటు ప్రభుత్వ నియంత్రణ పరిమితంగా ఉండటంతో.. ఆకాశమే హద్దుగా టికెట్ ధరలు పెరుగుతున్న పరిస్తితి. ఇలాంటివేళ.. ఈ అంశంపై నియంత్రణ కోసం పార్లమెంటరీ ప్యానెల్ ను ఏర్పాటు చేశారు. అసలేం జరుగుతుందన్న విషయంపై అధ్యయనం జరిపిన సదరు సంస్థ తాజాగా కీలక సిఫార్సులు చేసినట్లుగా చెబుతుననారు.

విమాన ఛార్జీలు అనూహ్యంగా పెరుగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి వేళ ప్రభుత్వాలు కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఇప్పుడున్న తీరుకు భిన్నంగా రూట్ ఆధారంగా విమాన ఛార్జీలపై పరిమితి విధించాలని కోరారు. విమాన టికెట్ ధరల్ని వీలుగా ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాల్సిందిగా సిపార్సు చేయటం గమనార్హం. ఒక సీజన్ లేదంటే పండుగలు.. సెలవుల్లో విమాన ఛార్జీలు అదుపు తప్పినట్లుగా కమిటీ గుర్తించింది.

టికెట్ ధరలపై విమానయాన సంస్థల స్వీయ నియంత్రణ అవసరమని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన నియంత్రణ విధానం సరిగా లేదని పేర్కొంది. విమాన ఛార్జీలపై నియంత్రణ ఉండటంతో పాటు పాక్షిక న్యాయాధికారులుండే ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరుతూ సిఫార్సు చేయటం గమనార్హం.

కంపెనీల వాణిజ్య ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని పండుగలు.. పీక్ సీజన్ లో ముందస్తు నోటీసుతో పరిమితి పెంపు దిశగా ప్రయత్నించాలని కోరింది. ఒకే విమానంలో వేర్వేరు సీట్లకు వేర్వేరు ధరల విధానాన్ని పునరాలోచించాలని కోరింది. ఈ తీరు సమానత్వ సూత్రానికి వ్యతిరేకమని పేర్కొంది. టికెట్ తో పాటు ఇతర సౌకర్యాల్ని బండిల్ గా కాకుండా ప్రాధమిక అవసరాలు తీర్చేలా వాటిని వేర్వేరుగా ఇస్తే.. విమాన ప్రయాణికుల మీద భారం తగ్గించేందుకు వీలు అవుతుందని పేర్కొన్నారు. మరి.. ఈ సిఫార్సుల్లో కేంద్రం ఎన్నింటికి ఓకే అంటుందో చూడాలి.