ఢిల్లీలో 400 మంది ప్రయాణికులతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!
ఇటీవల విమానాల్లో జరుగుతున్న పలు ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 May 2025 4:31 AMఇటీవల విమానాల్లో జరుగుతున్న పలు ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఓ విమానంలో ప్లాస్టిక్ కరిగిన వాసన వచ్చి, క్యాబిన్ లో పొగలు రావడం తీవ్ర ఆందోళన కలిగించింది. దీంతో.. ఈ విమానాన్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. .
అవును... బ్యాంకాక్ నుంచి మాస్కో వెళ్తున్న ఏరోఫ్లోట్ విమానంలో ప్లాస్టిక్ కరిగిన వాసనతో పాటు క్యాబిన్ లో పొగలు వ్యాపించినట్లు చెబుతున్నారు! దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో ఆ విమానంలో 400 మంది ప్రయాణికులు ఉన్నట్లు విమానయాన సంస్థ తెలిపింది.
ఈ సందర్భంగా స్పందించిన రష్యాకు చెందిన ఏరోఫ్లోట్ వైమానిక సంస్థ... ప్లాస్టిక్ కరిగిన వాసన రావడంతోనే బ్యాంకాక్ నుంచి మాస్కో వెళ్తున్న ఎస్.యూ.273 విమానాన్ని ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని తెలిపింది. ప్రామాణిక పద్దతుల మేరకే విమానాన్ని అత్యవసరంగా దించినట్లు ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు... పాకిస్థాన్ కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఖతార్ ఎయిర్ వేస్ ప్రకటించింది. పరిస్థితిని సునిశితంగా గమనిస్తున్నామని.. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమ మొదటి ప్రాధాన్యమని ఖతార్ ఎయిర్ వేస్ తెలిపింది. ఇదే సమయంలో శ్రీనగర్ కు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు స్పైస్ జెట్ ప్రకటించింది.