Begin typing your search above and press return to search.

నీలి చిత్రాలు తరచుగా చూస్తున్నారా.. అయితే ఇక అంతే!

దాదాపు అంతా ఏదో ఒక సమయంలో నీలి చిత్రాలు చూసేవారే. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో చేతిలో స్మార్ట్‌ ఫోన్

By:  Tupaki Desk   |   18 March 2024 8:14 AM GMT
నీలి చిత్రాలు తరచుగా చూస్తున్నారా.. అయితే ఇక అంతే!
X

దాదాపు అంతా ఏదో ఒక సమయంలో నీలి చిత్రాలు చూసేవారే. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో చేతిలో స్మార్ట్‌ ఫోన్, దానికి ఇంటర్నెట్‌ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో నీలి చిత్రాల వైపు మనసులాగందెవరికి? అయితే అదే పనిగా.. తరచూ నీలి చిత్రాలు చూస్తే మాత్రం లాభాలకంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తరచూ నీలి చిత్రాలు చూసేవారిలో శృంగారంపై ఆసక్తి తగ్గడంతోపాటు స్తంభన లోపాలు తలెత్తుతాయని అంటున్నారు. అశ్లీల చిత్రాలను చూడటం కూడా ఒకరకంగా మాదక ద్రవ్యాల వ్యసనం లాంటిదేనని చెబుతున్నారు. ఒకసారి డ్రగ్స్‌ కు అలవాటుపడితే మానుకోలేన్నట్టు.. నీలి చిత్రాలు చూడటానికి అలవాటుపడితే మానుకోలేరని హెచ్చరిస్తున్నారు.

డ్రగ్స్‌ కు అలవాటుపడితే వాటి ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని.. దీంతో మరింత ఎక్కువ మొత్తంలో డ్రగ్స్‌ ను తీసుకుంటారంటున్నారు. అలాగే నీలిచిత్రాలను చూడటం కూడా మొదట సరదాగా మొదలై.. ఆ తర్వాత ఎక్కువ సమయం వాటిని చూడటానికే హెచ్చిస్తారని పేర్కొంటున్నారు. దీంతో రానురాను శృంగారంపై ఆసక్తి తగ్గిపోవడంతోపాటు అంగ స్తంభన లోపాలు తలెత్తుతాయని చెబుతున్నారు.

ఈ మేరకు తాజా అధ్యయనం కూడా ఇదే విషయాన్ని పేర్కొంటోంది. అశ్లీల చిత్రాలను చూసినప్పుడు కూడా మాదక ద్రవ్యాలను తీసుకున్నప్పుడు మెదడులో ప్రేరేపితమయ్యే భాగాలే ప్రేరేపితమవుతాయని అంటోంది. వీటిని తరచుగా చూసేవారిలో క్రమంగా వాటి ప్రభావాన్ని ‘తట్టుకోవటం’ సంభవిస్తోందని.. దీంతో శృంగార స్పందనలు, శృంగారంపై ఆసక్తి తగ్గిపోవడం జరుగుతుందని పేర్కొంటున్నారు.

తరచూ నీలి చిత్రాలు చూడటం వల్ల నిజ జీవితంలో శృంగారానుభూతిపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. నిజంగా శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా అలాంటి దృశ్యాలే మనసులో కదలాడుతాయని అంటున్నారు. దీంతో సహజ శృంగారం కాస్తా కృత్రిమ శృంగారంలా మారుతుందని.. ఇది చివరకు అసంతృప్తికి, ఆందోళనలకు కారణమవుతుందని వివరిస్తున్నారు. కాబట్టి అశ్లీల చిత్రాలకు దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు.

అలాగే నిద్ర మరీ తగ్గినా, మరీ ఎక్కువైనా పురుషుల్లో వీర్యం నాణ్యత దెబ్బతింటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 7–8 గంటల సేపు నిద్రపోయినవారిలో వీర్యం నాణ్యత బాగా ఉంటున్నట్టు వెల్లడైంది. 6 గంటల కన్నా తక్కువ, 9 గంటల కన్నా ఎక్కువసేపు పడుకునేవారిలో వీర్యం నాణ్యత భారీగా పడిపోయింది.

రోజుకు 60 గ్రాముల గింజపప్పులు తినేవారికి శృంగార ఆసక్తి పెరగటంతో పాటు మెరుగైన భావప్రాప్తిని పొందుతారని చెబుతున్నారు. ఇవి స్తంభన లోపం తగ్గటానికే కాకుండా గుండె రక్తనాళ వ్యవస్థకూ మేలు చేయొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.