ఆది.. ఆధిపత్య రాజకీయం.. మూడు పువ్వులు..!
తాజాగా మరో వివాదం తెరమీదికి వచ్చింది. సిమెంటు కంపెనీలను బెదిరించిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చకు దారి తీసింది.
By: Tupaki Desk | 17 April 2025 8:00 PM ISTబీజేపీ నాయకుడు, సీనియర్ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ వ్యవహారం ముదురుతోంది. నిన్న మొన్నటి వరకు టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డితో వివాదానికి దిగారు. కడపలోని ఫ్లైయాష్ విషయంలో ఇరువర్గాలు రగడకు దిగాయి. దీంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సమస్యగా మారి.. పెద్ద రచ్చకు దారి తీసింది. ఈ సమయంలోనే సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని.. సర్ది చెప్పారు. దీంతో గొడవలు సర్దుకున్నాయని అందరూ భావించారు.
అయితే.. తాజాగా మరో వివాదం తెరమీదికి వచ్చింది. సిమెంటు కంపెనీలను బెదిరించిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చకు దారి తీసింది. తమకే కాంట్రాక్టులు ఇవ్వాలని.. అల్ట్రాటెక్ వంటి అంతర్జాతీయ సంస్థను బెదిరించిన వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది. ఇప్పటి వరకు ఎవరూ కూడా ఇంతభారీ స్థాయిలో ఒక సంస్థను నేరుగా బెదిరించిన సందర్భం కానీ.. సొమ్ముల కోసం పట్టుబట్టిన వ్యవహారం కానీ లేదు.
కానీ, ఆది నారాయణరెడ్డి వ్యవహారం చాలా పీక్ స్టేజ్‌కు చేరిపోయినట్టే కనిపిస్తోంది. ఇది పార్టీ పరంగా బీజేపీకి ఎలా ఉన్నా.. ప్రభుత్వ పరంగా చూస్తే.. సర్కారుకు ఇబ్బందికర పరిణామం. గతంలో వైసీపీ నాయ కులు బెదిరించారని.. సంస్థలు వెళ్లిపోయాయని ప్రచారం చేసిన నేపథ్యాన్ని చూసుకుంటే.. ఇప్పుడు అంతకు మించిన విషయంగా దీన్ని చూడాల్సి వస్తోంది. ఇది ఎవరికీ మంచి విధానం కాదు. పైగా.. పెట్టు బడులు రాబట్టుకునే పరిస్థితిలో ఉన్న సమయంలో ఆది వంటి సీనియర్ నాయకుడు ఇలా చేయడం సరికాదన్న వాదనా వినిపిస్తోంది.
సో.. ఎలా చూసుకున్నా.. ఆది చేసిన వ్యవహారంపై బీజేపీ చర్యలకు దిగకుండా.. చోద్యం చూస్తే.. అది మరింత ముప్పుగానే పరిణమిస్తున్నారు. ఒకరు చేసిన పాపం మరింత మందికి చుట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికైనా ఇలాంటి నాయకులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేకపోతే.. సర్కారు అభాసుపాలై.. పెట్టుబడులపై ప్రభావం కనిపించే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
