ఫ్యాన్ కింద ఉక్కబోత : వైసీపీ మాజీ మంత్రి టీడీపీకి సపోర్ట్ ?
వైసీపీలో అలా ఒక మాజీ మంత్రి వైసీపీ అధినాయకత్వానికి అత్యంత క్లోజ్ అయిన నేత సొంత ఆదిమూలపు సురేష్ పార్టీకే వెన్నుపోటు పొడిచారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.
By: Tupaki Desk | 14 April 2025 8:00 AM ISTరాజకీయం అంటేనే రకరకాలైన ఎత్తులు వ్యూహాలు ఉంటాయి. అయితే అవి ప్రత్యర్ధులకు అప్లై చేసే క్రమంలో సొంత పార్టీలో వారు కూడా తమకు అవసరం అయిన సందర్భంలో ప్రయోగిస్తూంటారు. తమ వారి మీదనే వారు ఈ రకంగా ప్లాన్స్ వేస్తూంటారు.
వైసీపీలో అలా ఒక మాజీ మంత్రి వైసీపీ అధినాయకత్వానికి అత్యంత క్లోజ్ అయిన నేత సొంత ఆదిమూలపు సురేష్ పార్టీకే వెన్నుపోటు పొడిచారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎంపీపీని గద్దె దించేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీకి ఆ పార్టీ పెట్టిన అవిశ్వాసానికి ఆ మాజీ మంత్రి తన వర్గం వారికే ఆ వైపుగా పంపించి సపోర్టు చేయించారు అన్న వార్తలు అయితే గుప్పుమంటున్నాయి.
అయితే మొత్తం 16 మంది మెంబర్స్ కి గానూ చెరి సగంగా అక్కడ బలాబలాలు ఈ ఫిరాయింపులతో మారడంతో చివరి నిముషంలో టీడీపీలోకి వెళ్ళిన వైసీపీ మెంబర్ వైసీపీకి అనుకూలంగా ఓటు వేయడంతో త్రిపురాంతకం ఎంపీపీ వైసీపీ పరం అయింది అని అంటున్నారు.
అసలు ఆదిమూలపు సురేష్ ఇదంతా చేయించారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన ఎందుకు చేశారు, ఎందుకు చేస్తారు అన్న చర్చ సాగుతోంది. ఆయన వైసీపీలో క్రియాశీలకంగా ఉంటూ వచ్చారు. జగన్ కి ఎంత సన్నిహితులు అంటే 2019 నుంచి 2024 మధ్యలో ఆయనకు కీలకమైన శాఖలు ఇచ్చారు మొదట విద్యా శాఖ ఇచ్చారు. ఆ తరువాత మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చారు. అయిదేళ్ళ పాటు ఆయనను మంత్రిగా కొనసాగించారు.
అయితే ఆయనకు 2024 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం టికెట్ ని అధినాయకత్వం ఇవ్వకుండా వేరే చోటకు షిఫ్ట్ చేసింది. అక్కడ ఆయన పరాజయం పాలు అయ్యారు. ఇక ఎర్రగొండపాలెం టికెట్ ని చంద్రశేఖర్ కి ఇచ్చింది. ఆయన గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. దాంతో చంద్రశేఖర్ వర్సెస్ ఆదిమూలం గా లోకల్ పాలిటిక్స్ సాగుతోంది అని అంటున్నారు.
చంద్రశేఖర్ ని పార్టీ హైకమాండ్ వద్ద తక్కువ చేసి చూపించాలన్న ఉద్దేశ్యంతోంతోనే ఆయన సొంత నియోజకవర్గంలో ఎంపీపీ అవిశ్వాసం వేళ వైసీపీ ఓటమికి మాజీ మంత్రి మంత్రాంగం వేశారని ఆయన వర్గాన్ని టీడీపీలోకి పంపించడం వెనక ఆయన హస్తం ఉందని అంటున్నారు.
ఈ మొత్తం వ్యవహారం అధినాయకత్వానికి చేరడంతో సీరియస్ ఇష్యూ అయింది అని అంటున్నారు. అయితే పార్టీలో ఉంటూ అధినేత నమ్మిన వారే ఇలా చేస్తే ఎలా అన్న చర్చ అయితే ఫ్యాన్ పార్టీలో వస్తోందట. ఆదిమూలం సురేష్ వర్గీయులు మాత్రం రాజకీయంగా తమకు స్థానిక ఎమ్మెల్యే దెబ్బ తీస్తున్నారు అని అంటున్నారు.
ఏది ఏమైనా ఎర్రగుండపాలెంలో వైసీపీలో వర్గ పోరు జాస్తీగా ఉంది. మాజీ మంత్రి వర్సెస్ తాజా ఎమ్మెల్యేగా అది పరిణమిస్తోంది. హైకమాండ్ జోక్యం చేసుకుని ఎవరి హద్దులు ఎవరి పరిధిలు నిర్ణయించకపోతే మాత్రం మరిన్ని ఈ తరహా ఘటనలు జరుగ్తాయని అంటున్నారు. ఇక ఆదిమూలం కి గతంలో ఇచ్చిన ప్రాధాన్యత అయితే ఇపుడు దక్కుతుందా అన్నది కూడా మరో చర్చగా ఉందట.
