Begin typing your search above and press return to search.

వైసీపీలో ఆదాలకు పొగ పెడుతున్నదెవరు ?

అయితే 2024లో మాత్రం జాతకం మొత్తం తిరగబడింది వైసీపీకి చేదు ఫలితాలే వచ్చాయి.

By:  Tupaki Desk   |   7 Jun 2025 3:58 AM
వైసీపీలో ఆదాలకు పొగ పెడుతున్నదెవరు  ?
X

నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట అన్నది అందరికీ తెలిసిందే. ఆ పార్టీ పెట్టిన వెంటనే వచ్చిన నెల్లూరు లోక్ సభ ఉప ఎన్నికల్లోనే ఘన విజయం సాధించి సింహపురి గడ్డ నాదీ అని ధీమాగా ప్రకటించింది. ఆ తర్వాత 2014లోనూ మెజారిటీ సీట్లు సొంతం చేసుకుంది. 2019లో అయితే మొత్తానికి మొత్తం స్వీప్ చేసి పారేసింది.

అయితే 2024లో మాత్రం జాతకం మొత్తం తిరగబడింది వైసీపీకి చేదు ఫలితాలే వచ్చాయి. నెల్లూరు లో వైసీపీ భారీ ఓటమి చెందింది. ఒక్క సీటూ దక్కించుకోలేక చతికిలపడింది. ఇక నెల్లూరు వైసీపీలో నేతలు కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు. ఉన్న వారూ జైలు పాలు అవుతునారు.

బడా నేతగా వైసీపీకి ఉన్న కాకాణి గోవర్ధనరెడ్డి జైలు పాలు అయ్యారు. మరో నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ మధ్యనే యాక్టివ్ అయినా అందరినీ కలుపుకొని పోవడం లేదు. అయితే సీనియర్ మోస్ట్ నేతగా ఉంటూ పాతికేళ్లకు పైబడి రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి మాత్రం వైసీపీలో ఉన్నారా అంటే ఉన్నారని అంటున్నారు.

ఆయన గురించి వైసీపీ పట్టించుకోవడం లేదా అంటే ఏమో అన్న జవాబు వస్తోంది. ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అంతకు ముందు ఆయన కాంగ్రెస్ లో పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు నెల్లూరు పార్లమెంట్ మెంబర్ గా చేసిన ఆదాలకు పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో బలమైన అనుచర గణం ఉంది.

ఆయన కంటూ అభిమానులు ఉన్నారు. అలాంటి ఆదాల ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటునారు. అపుడపుడు నెల్లూరు వచ్చీ వెళ్తున్నా ఆయన శుభ కార్యక్రమాల కోసమే వస్తున్నారు అని అంటున్నారు. పార్టీ ఆఫీసు ముఖం ఆయన చూడడం లేదు, ఆయనకు పిలుపులు కూడా వెళ్ళడం లేదు అని అంటున్నారు.

దాంతో ఆదాల పార్టీలో ఉన్నట్లా లేనట్లా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. ఆదాల వంటి బిగ్ షాట్ పార్టీలో ఉన్నా ఆయన సేవలను ఎందుకు వినియోగించుకోవడం లేదు అని అంటున్న వారూ ఉన్నారు. అయితే పార్టీలో మరో వర్గం అయితే ఆయన వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నారని అందుకే ఆయన అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు అని అంటున్నారు.

అయితే తమకు ఏదీ చెప్పకుండా దూరం పెడుతున్నారని అలాంటపుడు ఎలా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేది అని అంటున్నారు. నెల్లూరు అర్బం రూరల్ తో పాటు కోవూరు కావలి ఆంతకూరు ఉదయగిరిలలో ఆదాలకు మంచి పట్టు ఉంది అని చెబుతున్నారు. అయితే ఆయనను కావాలనే పార్టీ నేతలు దూరం పెడుతున్నారని అంటున్నారు. అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని అంటున్నారు.

ఇక వైసీపీ అధినేత జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. ఇలా అనేక రకాలైన ఫిర్యాదులు అయితే ఆదాల వర్గంలో ఉన్నాయి. దాంతో పాటు పార్టీలో ఒక వర్గం అయితే ఆదాలను పొమ్మనకుండా పొగ

పెట్టేసిందని అంటున్నారు. దీంతో ఈ సీనియర్ నేత ఏమి చేస్తారో అన్న చర్చ సాగుతోంది. ఆయన కూటమి వైపు చూస్తున్నారు అన్న ప్రచారానికి బలం చేకూర్చేలా నిర్ణయం తీసుకుంటారా లేక కాకాణి లేని వేళ ఆయనను పార్టీ పెద్దలు పిలిచి పెద్ద పీట వేస్తారా అన్న చర్చ అయితే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సాగుతోంది. చూడాలి మరి ఆదాల ఆరి దారి ఎటో అన్నది.