Begin typing your search above and press return to search.

పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న వెంకీ హీరోయిన్!

సినిమా ఇండస్ట్రీకీ రాజకీయాలకూ విడదీయలేని సంబంధం ఉందని అంటుంటారు

By:  Tupaki Desk   |   17 Jan 2024 10:38 AM GMT
పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న వెంకీ హీరోయిన్!
X

సినిమా ఇండస్ట్రీకీ రాజకీయాలకూ విడదీయలేని సంబంధం ఉందని అంటుంటారు. సినిమాల్లో నటించడం అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ పాలిటిక్స్ లో పెర్ఫార్మెన్స్ అనేది చాలామంది నుంచి వినిపించే మాట! ఇలా సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్లి అద్భుతంగా రాణించినవారూ ఉన్నారు.. ప్లాప్ సినిమాలా మిగిలిపోయినవారూ లేకపోలేదు. ఈ సమయంలో తాజాగా స్టార్ హీరోయిన్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని తెలుస్తుంది.

అవును... తెలుగు సినిమాల్లో వెంకటేష్ తో సూపర్ డూపర్ హిట్ సినిమాలైన చంటి, అబ్బాయిగారు, సుందరకాండ, సూర్యవంశం, తాజాగా.. దృశ్యం వంటి సినిమాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ మీనా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రధానంగా ఏఎన్నార్ తో "సీతారత్నంగారి మనవరాలు" సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో ఫిక్సయిపోయింది. ఈ క్రమంలో ఆమె రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారంటూ కథనాలు హల్ చల్ చేస్తున్నాయి.

వాస్తవానికి హీరోయిన్ లలో నాటి నుంచి నేటివరకూ చాలా మంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి బాగానే రాణించారు. నాడు జయలలిత నుంచి జయప్రద, విజయశాంతి, కుష్బూ, రోజా మొదలైన నటీమణులు పాలిటిక్స్ లోనూ సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా మీనా కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు. అందుకు కారణమైంది సంక్రాంతినాటి ఒక ఫోటో!

తాజాగా ఢిల్లీలో నిర్వహించిన పొంగల్ వేడుకల్లో ప్రధానికి సమీపంలో మీనా కనిపించారు. ఈ వేడుకలకు మీనాను కేంద్రమంత్రి ఎల్. మురుగన్ ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది. ఇక‌, ఈ పొంగ‌ల్ వేడుక‌ల‌కు బీజేపీలోని పలువురు కీలక నేతలు, కేంద్రమంత్రులు హాజ‌ర‌య్యారు. ఈ వేడుకల్లో మీనా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించారు. దీంతో ఊహాగాణాలు మొదలైపోయాయి.

ఇందులో భాగంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి మీనా.. బీజేపీలో చేరతారని, అందుకే ప్రధాని ప్రత్యేకంగా నిర్వహించుకున్న కార్యక్రమంలో ఆమెకు ప్రాధాన్యత ఇచ్చారని, పొలిటికల్ ఎంట్రీకి ఆమెకు సిద్ధంగా ఉన్నారని సోషల్ మీడియా వేదికగా చర్చ మొదలైపోయింది. ప్రస్తుతానికి ఈ విషయంపై మీనా ఎటువంటి ప్రకటనా చేయనప్పటికీ... ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ మాత్రం కన్ ఫాం చేసేస్తున్నారు.