Begin typing your search above and press return to search.

హాట్ బ్యూటీ అరెస్ట్‌, రోడ్డుపై దారుణంగా...!

హిందీ ప్రేక్షకులతో పాటు సౌత్ లో అన్ని భాషల ప్రేక్షకులకు సోషల్ మీడియా ద్వారా సుపరిచితురాలు అయిన ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్‌.

By:  Tupaki Desk   |   3 Nov 2023 11:33 AM GMT
హాట్ బ్యూటీ అరెస్ట్‌, రోడ్డుపై దారుణంగా...!
X

హిందీ ప్రేక్షకులతో పాటు సౌత్ లో అన్ని భాషల ప్రేక్షకులకు సోషల్ మీడియా ద్వారా సుపరిచితురాలు అయిన ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్‌. ఈ అమ్మడు చిత్ర విచిత్రమైన ఫోటో షూట్స్ ను షేర్ చేయడం ద్వారా ఎప్పుడూ కూడా వార్తల్లో ఉంటుంది. అయితే ఈసారి హాట్ ఫోటోల కారణంగా కాకుండా అరెస్ట్‌ అయిన కారణంగా వార్తల్లో నిలిచింది.

ఉర్ఫీ ధరించినన్ని విభిన్నమైన కాస్ట్యూమ్స్ ను ఏ ఒక్క సోషల్ మీడియా సెలబ్రెటీ కానీ ఇతర హీరోయిన్స్ కానీ ధరించలేదు అనడంలో సందేహం లేదు. ఆ చిత్ర విచిత్రమైన డ్రెస్ లను ధరించి రోడ్ల మీదకు వచ్చి న్యూసెన్స్ ను క్రియేట్‌ చేస్తోంది అంటూ చాలా సార్లు చాలా రకాలుగా కామెంట్స్ చేయడంతో పాటు ఫిర్యాదులు కూడా చేశారు.

ఆ ఫిర్యాదులో కారణంగానో లేదా మరేంటో కానీ ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ ను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. నేడు ఉదయాన్నే ఆమె ఎప్పటిలాగే విభిన్నమైన హాట్‌ ఔట్ ఫిట్ లో టీ తాగేందుకు రోడ్డు మీదకు వచ్చింది. ఉర్ఫీ ని టీ షాప్ వద్దే అరెస్ట్‌ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లడం తో సోషల్‌ మీడియా లో ఆ వీడియో లు వైరల్‌ అవుతున్నాయి.

ఉర్ఫీ అరెస్ట్‌ కు సంబంధించిన విషయాన్ని గురించి పోలీసుల నుంచి ఎలాంటి క్లారిటీ లేదు అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అసలు ఆమెను ఎందుకు అరెస్ట్‌ చేశారు అంటూ మీడియా వారు పోలీసులను సంప్రదించేందుకు ప్రయత్నించగా రెస్పాన్స్‌ లేదని ఉత్తరాది మీడియా వర్గాల వారు అంటున్నారు. న్యూసెన్స్ కేసు వల్లే ఆమెను అరెస్ట్‌ చేశారు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఉర్ఫీ హాట్‌ ఫోటోలతోనే కాకుండా ఇలా కూడా వార్తల్లో నిలుస్తోంది.