Begin typing your search above and press return to search.

మెగా కుటుంబానికి సీఎం పదవి ఖాయమంటున్న నటుడు శివాజి...!

నిజానికి సీఎం పదవి వారికి దక్కడం అన్నది పెద్ద కష్టం కూడా కాదని ఆయన విశ్లేషించారు.

By:  Tupaki Desk   |   30 Dec 2023 1:35 PM GMT
మెగా కుటుంబానికి సీఎం పదవి ఖాయమంటున్న నటుడు శివాజి...!
X

మెగాస్టార్ కుటుంబానికి ముఖ్యమంత్రి పదవి దక్కడం పెద్ద విషయం కాదు, ఆ కుటుంబానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారని నటుడు బిగ్ బాస్ సెవెన్ ఫేం శివాజీ అంటున్నారు. మెగాస్టార్ ఫ్యామిలీ అంటే అభిమాన జనం వెల్లువలా ఏపీ అంతా ఉన్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి సీఎం పదవి వారికి దక్కడం అన్నది పెద్ద కష్టం కూడా కాదని ఆయన విశ్లేషించారు.

అయితే ఎక్కడో లోపం ఉందని ఆయన అంటున్నారు. అంటే నాటి ప్రజారాజ్యం నుంచి నేటి జనసేన వరకూ చూస్తే ఆ పార్టీ నిర్మాణంలో లోపమా లేక మెగా ఇమేజ్ ని ఓట్లుగా కన్వర్ట్ గా చేసుకోవడంలో లోపమా అన్నది శివాజీ చెప్పలేదు కానీ కచ్చితంగా లోపం అయితే ఉంది అని అంటున్నారు.

దానికి చక్కదిద్దుకుని ముందుకు సాగితే మాత్రం ఆ కుటుంబంలో ఒకరు సీఎం అయ్యే చాన్స్ అలా సజీవంగానే ఇంకా ఉందని శివాజీ అంటున్నారు. ఇక తన గురించి ఆయన చెబుతూ తాను ఏ రాజకీయ పార్టీలో ప్రస్తుతం లేనని అన్నారు. తాను ప్రజల గొంతుకగా ఉన్నాను అన్నారు.

గతంలో తాను బీజేపీలో ఉన్నానని శివాజీ గుర్తు చేశారు. అయితే ఏపీకి సంబంధించి విభజన హామీలు ప్రత్యేక హోదా వంటివి అమలు జరగలేదని అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. తాను యువత భవిష్యత్తు ప్రజల కోసం పోరాటం చేశాను అని అన్నారు. తాను ప్రజల పక్షాన ఉంటాను అన్నారు.

ఇదిలా ఉంటే వర్తమాన తరానికి రావాల్సిన వనరులు మౌలిక సదుపాయాల నిధులు రాజకీయ నేతల జేబులలోకి వెళ్తున్నాయని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలలో చూసినా ప్రశ్నించాలన్న తత్వం లేకుండా పోయింది అని ఆయన అన్నారు. తాను ఏపీ ప్రజల కోసం పదేళ్ళ పాటు పోరాడాను అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో తన రియల్ క్యారెక్టర్ ఏంటి అనది ప్రజలు అంతా చూశారని తాను అలాగే ఉంటానని అన్నారు. తాను ఎపుడూ అలాగే ఉన్నాను అని అన్నారు. తాను ఇప్పటికి సంపాదించుకున్న పేరు శివన్న అని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే శివాజీ 90 ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ లో నటించారు. దానికి సంబంధించి ట్రైలర్ లాంచ్ లో ఆయన పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ లో రానుంది.