Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల వేళ అడ్డంగా బుక్కైన న‌టుడు!

`రేసుగుర్రం`లో మ‌ద్దాలి శివారాడెడ్డి పాత్ర‌తో భోజ్ పురి న‌టుడు ర‌వికిష‌న్ ఎంత ఫేమ‌స్ అయ్యాడో చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   16 April 2024 8:33 AM GMT
ఎన్నిక‌ల వేళ అడ్డంగా బుక్కైన న‌టుడు!
X

`రేసుగుర్రం`లో మ‌ద్దాలి శివారాడెడ్డి పాత్ర‌తో భోజ్ పురి న‌టుడు ర‌వికిష‌న్ ఎంత ఫేమ‌స్ అయ్యాడో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ ఒక్క చిత్రంతోనే తెలుగు లో మంచి అవ‌కాశాలు అందుకున్నాడు. ఇక భోజ్ పురి...హిందీ భాష‌ల్లో ఎన్నో సినిమాల్లో న‌టించాడు. అలాగే రాజ‌కీయాల్లోనూ చ‌క్రం తిప్పిన నాయ‌కుడిగా మంచి పేరుంది. 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ త‌రుపున ఎంపీగానూ గెలిచాడు. అత‌డి స‌క్సెస్ ట్రాక్ చూసి మ‌ళ్లీ అవ‌కాశం ర‌వికిష‌న్ కే ఇచ్చిందా పార్టీ. అయితే ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతోన్న నేప‌థ్యంలో తాజాగా ర‌వికిష‌న్ ఓ వివాదంలో ఇరుక్కున్నాడు.

అప‌ర్ణా ఠాకూర్ అనే మ‌హిళ ర‌వికిష‌న్ త‌న‌కు భ‌ర్త అంటూ మీడియా మందుకొచ్చింది. 1996 లో ర‌వికిష‌న్ తో వివాహం జ‌రిగింద‌ని 15 ఏళ్ల కుమార్తె కూడా ఉంద‌ని ఆరోపించింది. ఇప్ప‌టికీ ర‌వికిష‌న్ త‌మ రిలేష‌న్ షిప్ లో ఉన్నాడని మీడియా స‌మావేశంలో తెలిపింది. అయితే 15 ఏళ్లు వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కూ ర‌వికిష‌న్ త‌న‌కు తండ్రి అన్న విష‌యం తెలియ‌ద‌ని..అంకుల్ అని పిలిచేదాన్ని అని..ఆయన కుటుంబాన్ని కూడా తాను క‌లిసాన‌ని... తండ్రిగా త‌న ద‌గ్గ‌ర‌కు ఎప్పుడూ రాలేద‌ని... త‌న‌ని కుమార్తెగా స్వీక‌రించాల‌ని కోరింది. దీంతో ర‌వికిష‌న్ అడ్డంగా లాక్ అయినట్లు ఉంది.

స‌రిగ్నా ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న స‌మ‌యంలో వివాదంలో ఇరుక్కోవ‌డంతో అదిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. దీనిపై విచార‌ణ జ‌రిపి ర‌వికిష‌న్ పై క్లీన్ చీట్ వ‌స్తే త‌ప్ప ఎన్నిక‌ల్లో పోటీ చేసే ప‌రిస్థితి ఉండ‌దు. ఇప్ప‌టికే ర‌వికిష‌న్ కి పెళ్లి అయింది. ఆయ‌న భార్య పేరు ప్రీతి కిషన్. ఆ దంప‌తుకుల‌కు రివా.. తనిష్క్.. ఇషిత అనే ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం ర‌వి కిష‌న్ న‌టుడిగానూ బిజీగా ఉన్నాడు. హిందీలో ప‌లు సినిమాలు చేస్తున్నాడు.

రెండేళ్ల‌గా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్నాడు. తెలుగు లో మ‌ళ్లీ అవ‌కాశాలు రాలేదు. ఆయ‌న చివ‌రిగా టాలీవుడ్ లో `హీరో` అనే చిత్రంలో న‌టించాడు. ఆ త‌ర్వాత పెద్ద‌గా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో హిందీలోనే ప‌నిచేస్తున్నాడు. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో `లాప‌ట్టా లేడీస్`.. `జెఎన్ యూ` అనే చిత్రాల్లో న‌టిస్తున్నాడు. అవి షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి.