Begin typing your search above and press return to search.

ఫైల్, పాకెట్, బ్రెయిన్ ఏది ఖాళీ... ప్రకాశ్ రాజ్ ట్వీట్ వైరల్!

అవును... మోడీపై దుమ్మెత్తిపోస్తూ, తనదైన వెటకారాన్ని ఆన్ లైన్ వేధికగా జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నలు సందిస్తుంటారు ప్రకాశ్ రాజ్

By:  Tupaki Desk   |   20 Sep 2023 5:32 AM GMT
ఫైల్, పాకెట్, బ్రెయిన్ ఏది ఖాళీ... ప్రకాశ్ రాజ్ ట్వీట్ వైరల్!
X

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తనదైన శైలిలో విమర్శలు చేయడం, దానికోసం ప్రత్యేకంగా జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ తో పలు విషయాలపై తనదైన శైలిలో స్పందించడం ప్రకాశ్ రాజ్ నిత్య కృత్యాల్లో ఒకటి అని చెప్పినా అతిశయోక్తి కాదు. ఇందులో భాగంగా పలూ కీలక విషయాలపై ప్రకాశ్ రాజ్.. అత్యంత కీలక వ్యాఖ్యలు చేసిన సంగతూలు ఎన్నో ఉన్నాయి! ఈ సమయంలో మరోసారి ప్రకాశ్ రాజ్.. ప్రధాని మోడీ ఫోటో పోస్ట్ చేసి ఒక ప్రశ్న అడిగారు!

అవును... మోడీపై దుమ్మెత్తిపోస్తూ, తనదైన వెటకారాన్ని ఆన్ లైన్ వేధికగా జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నలు సందిస్తుంటారు ప్రకాశ్ రాజ్. ఈ సమయంలో తాజాగా జేబులో హ్యాండ్ ని, చేతిలో ఫైల్ ని పట్టుకుని ఉన్న మొడీ తాజా ఫోటోను షేర్ చేసిన ప్రకాశ్ రాజ్... "ఇక్కడ ఏది ఖాళీగా ఉందో చెప్పండి. ఆయన పట్టుకున్న ఫైల్?.. ఆ చేతిని పెట్టిన పాకెట్?.. లేదా బ్రెయిన్?.. అయిని ప్రశ్నించారు!

దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారుతుంది. ప్రధాని చేతిలో ఉన్న ఫైల్, చెయ్యి పెట్టిన జేబు లు ఖాళీ గా ఉన్నాయా.. లేక, ఆయన బుర్ర ఖాళీగా ఉందా అంటూ ఘాటుగా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదమయ్యే అన్ని లక్షణాలనూ కలిగి ఉందనే కామేంట్లు వినిపిస్తున్నాయి. అయితే మోడీపై తీవ్రస్థాయిలో రియాక్ట్ అవ్వడం ప్రకాశ్ రాజ్ కు ఇది ఫస్ట్ టైం కాదు.

గతంలో నీరవ్‌ మోడీ, లలిత్‌ మోడీ మధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోను ఉంచి.. తన ట్విటర్‌ వాల్‌ పై పోస్ట్‌ చేసిన ప్రకాశ్ రాజ్... జనరల్‌ నాలెడ్జ్‌.. ఈ ముగ్గురిలో కామన్‌ ఏంటి? జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ ట్వీట్‌ చేశారు. ఇది కూడా అప్పట్లో వైరల్ అయ్యింది.

ఇదే సమయంలో.. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తన పుట్టినరోజును పురస్కరించుకుని మధ్యప్రదేశ్‌ లోని కునో నేషనల్ పార్క్‌ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా మోడీ స్వదేశానికి రప్పించాల్సింది చీతాలు మాత్రమే కాదని.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తులను కూడా పిలిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాను ఏ ఛీటర్ల గురించి మాట్లాడుతున్నానో తెలుసు కదా? అని ప్రశ్నించారు.

తన ట్వీట్‌ కు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారులు మేహుల్ చోక్సీ, నీరవ్ మోడీ ఫొటోలను జత చేశారు. దీంతో... ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఈ ముగ్గురు ఆర్థిక నేరస్తులు దేశం విడిచి పారిపోయిన విషయాన్ని ప్రకాష్ రాజ్ పరోక్షంగా ప్రస్తావించారనే కామెంట్లు వినిపించాయి.

ఈ క్రమంలో తాజాగా మోడీ ఫోటోను షేర్ చేసిన ఆయన... ఫైల్, పాకెట్, బ్రెయిన్ లలో ఏది ఖాళీగా ఉంది అని ప్రశ్నించారు.