Begin typing your search above and press return to search.

ఓరీ మీ కొట్లాట పాడుగానూ.. అక్కడ కూడానా?

ఎవరెస్ట్‌ ను ఎక్కి ఆనందానుభూతులను సొందడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది దాన్ని అధిరోహించడానికి వస్తుంటారు.

By:  Tupaki Desk   |   10 July 2024 1:23 PM GMT
ఓరీ మీ కొట్లాట పాడుగానూ.. అక్కడ కూడానా?
X

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్‌ అనే సంగతి తెలిసిందే. హిమాలయాల్లో నేపాల్‌ దేశంలో 8,848 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శిఖరాన్ని అధిగమించడం సాహసికుల కల. ఎవరెస్ట్‌ ను ఎక్కి ఆనందానుభూతులను సొందడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది దాన్ని అధిరోహించడానికి వస్తుంటారు.

కాగా ఎవరెస్ట్‌ ఎక్కడం అంత ఈజీ కాదు. ఎంతో మంది పర్వతారోహకులు తమ ప్రాణాలను కోల్పోయారు. అనిశ్చితంగా ఉండే వాతావరణం, అప్పటికప్పుడు రేగే మంచు తుపాన్లు, విపరీతమైన చలి, ఎత్తుకు వెళ్లే కొద్దీ సరిపడినంత ఆక్సిజన్‌ అందకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ అడ్డంకులను అధిగమించి ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కితే ప్రపంచాన్ని జయించినంత సంబరపడతారు. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది.

అయితే ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిగమించిన రెండు వేర్వేరు పర్వతారోహకుల బృందాలు సెల్ఫీ తీసుకునే క్రమంలో కొట్లాటకు దిగాయి. ప్రాణాలకు తెగించి శిఖరాగ్రం చేరిన బృందాలు ఆ సంతోషాన్ని ఎంజాయ్‌ చేయాల్సింది పోయి గొడవకు దిగడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

సముద్ర మట్టానికి 29,030 అడుగుల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్‌ శిఖరం వ్యూ పాయింట్‌ లో సెల్ఫీ తీసుకునే క్రమంలో రెండు వేర్వేరు బృందాల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా ఇలా సెల్ఫీల కోసం గొడవ పడటమేంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ది ఇండిపెండెంట్‌ పత్రిక కథనం ప్రకారం.. ఈ షాకింగ్‌ సంఘటన గత నెల జూన్‌ 25న చోటు చేసుకుందని తెలుస్తోంది. నేపాల్‌ పరిధిలోని హిమాలయాల్లో ఉన్న 8,848 మీటర్ల వ్యూ పాయింట్‌ లో ఫొటోలు తీసుకోవడానికి రెండు పర్యాటక బృందాలు ఎలివేషన్‌ మాన్యుమెంట్‌ పాయింట్‌ లోకి వెళ్లగా అక్కడ వారి మధ్య వివాదం చోటు చేసుకుంది.

సెల్ఫీకి బెస్ట్‌ ప్లేస్‌ కోసం ఇద్దరు పర్వతారోహకుల మధ్య మొదట గొడవ మొదలైందని ది ఇండిపెండెంట్‌ కథనం పేర్కొంది. ఆ తర్వాత ఈ గొడవ రెండు బృందాల మధ్య వివాదానికి దారితీసిందని పేర్కొంది. ఆ తర్వాత ఒకరినొకరు తిట్టుకోవడంతోపాటు కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ బృందంలో ఉన్న మహిళ గొడవను ఆపడానికి ప్రయత్నించినా వారు ఆగకపోవడం గమనార్హం.