నోట్ల కట్టలే.. పరుపులు.. సోఫాలు: నరహరీ.. హరిహరీ!
పడకగదిలో తనిఖీ చేస్తున్న సమయంలో సిబ్బంది పరుపుపై కూర్చుకున్నారట. వారికి మెత్తగా తగలా ల్సిన పరుపులో ఏదో గట్టిగా తగిలినట్టు అనుమానం వచ్చింది.
By: Garuda Media | 16 Jun 2026 8:38 PM ISTశేష తల్పమున సుఖనివాసివై.. పవళించేవా దేవా!- అంటూ.. భక్త ప్రహ్లాద సినిమాలో ఓ పాట ఉంటుంది. వైకుంఠ ధాముడైన శ్రీమహా విష్ణువు.. శేషనాగును పట్టుపరుపులా చుట్టుకుని పవళించిన సందర్భం అంది. అయితే.. చిత్రమే అయినా.. హైదరాబాద్‌లో కీలక రెవెన్యూ శాఖ పోస్టులో ఉన్న భూములు, సర్వే డిప్యూటీ డైరెక్టర్.. సుంకరి నరహరి.. ఏకంగా నోట్ల కట్టలను పరుపులుగా సోఫాలుగామార్చుకుని వాటిపైనే పవళిస్తున్న విషయం తాజాగా వెలుగు చూసింది.
భారీగా అక్రమాస్తులు కూడగట్టారన్న ఆరోపణలు పెల్లుబుకతడంతో ఏసీబీ అధికారులు.. మంగళవారం ఆయన నివాసాలు సహా.. ఆయన సోదరుడు, ఇతర బంధువుల నివాసాల్లోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇళ్లలో కూడబెట్టిన నోట్ల కట్టలను చూసి ఏసీబీ అధికారులు ఆశ్చర్య పోయారు. ``మేం ఇప్పటి వరకు ఇంత భారీ మొత్తంలో నగదును చూడలేదు`` అని అధికారులు వ్యాఖ్యానించారంటే.. అవినీతి ఏ రేంజ్‌లో ఉందో అర్ధమవుతుంది.
పడకగదిలో తనిఖీ చేస్తున్న సమయంలో సిబ్బంది పరుపుపై కూర్చుకున్నారట. వారికి మెత్తగా తగలా ల్సిన పరుపులో ఏదో గట్టిగా తగిలినట్టు అనుమానం వచ్చింది. దీంతో పరుపుపై మొదట చేత్తో అద్ది చూశా రు. అది మెత్తగా అనిపించలేదు. దీంతో పరుపును చింపి చూడగా 500 నోట్ల కట్లలను రెండు వరుసల్లో పేర్చి పరుపును రూపొందించినట్టు గుర్తించి ఆశ్చర్యం వేసింది. ఇక, నరహరి బయట సోఫాలో కూర్చు న్నారు. అధికారులు ఆయన కూర్చున్న చోట నుంచి లేవకపోవడంతో అనుమానం వచ్చి.. అక్కడ కూడా పరిశీలించారు. ఇంకేముంది.. అక్కడ కూడా నోట్ల కట్టలే దర్శనమిచ్చాయి.
పరుపులు, సోఫాల్లోని కట్లలను అతి కష్టం మీద లెక్కించగా.. దాదాపు కోటి 20 లక్షల రూపాయలకు పైగానే సొమ్ములు లెక్కతేలాయి. ఇక, బంగారం.. ఆస్తుల పత్రాలు లెక్కతేలాల్సి ఉందని అధికారులు చెబుతు న్నారు. దాదాపు 25 సంవత్సరాలుగా రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న నరహరి.. భారీగానే పోగేసిన విషయంపై ఇటీవల ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. మరోవైపు హైదరాబాద్ లోని ఖరీదైన ప్రాంతాల్లోనూ నరహరిస్థిరాస్థిని కూడబెట్టారట. ఇప్పుడు వాటి సంగతి తేలుస్తున్నారు.
