Begin typing your search above and press return to search.

ఈ ట్రాక్టర్ నడుపుతున్నాయన వేల కోట్ల అధిపతి.. ఇవిగో వివరాలు!

అవును... నైజీరియాకు చెందిన బిలియనీర్ అబ్దుల్ మునాఫ్ యూనుసా సరీనా అనే వ్యక్తికి సంబంధించిన సోషల్ మీడియాలో కనిపించే ఫోటోలు, వీడియోలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి!

By:  Tupaki Desk   |   31 May 2025 5:00 AM IST
ఈ ట్రాక్టర్  నడుపుతున్నాయన వేల కోట్ల అధిపతి.. ఇవిగో వివరాలు!
X

కొంతమంది ఏమీ లేకపోయినా ఎగిరెగిరి పడుతుంటారనే పేరు సంపాదించుకుంటే.. కొంతమంది మాత్రం అన్నీ ఉన్నా సింపుల్ గా ఉంటారు తొణకకుండా అనే పేరు సంపాదించుకుంటారు! ఈ సమయంలో ఈ రెండో కోవకు చెందిన వ్యక్తే.. నైజీరియాకు చెందిన బిలియనీర్ అబ్దుల్ మునాఫ్ యూనుసా సరీనా! ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..!

అవును... నైజీరియాకు చెందిన బిలియనీర్ అబ్దుల్ మునాఫ్ యూనుసా సరీనా అనే వ్యక్తికి సంబంధించిన సోషల్ మీడియాలో కనిపించే ఫోటోలు, వీడియోలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి! ఆ ఫోటోల్లో ఆయన బైక్ పైనా, ట్రాక్టర్ పైనా, నడుస్తూ, పొలాల్లో కనిపిస్తుంటారు! అంత సింపుల్ గా కనిపించే వ్యక్తికి విమానాలతో పాటు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయనేది ఇక్కడ కీలకం!

నైజీరియాకు చెందిన వ్యాపారవేత్త అబ్దుల్ మునాఫ్ సరినా... పీ.హెచ్.డీ చేయడంతోపాటు ఒక యూనివర్సిటీని నడిపిస్తున్నారు. ఆయన ఎన్నో విజయాలు సాధించారు. ఈ క్రమంలో ఆయనకు యూకే కి చెందిన రెండు బోయింగ్ లతో సహా ఏకంగా ఆరు విమానాలు కలిగి ఉన్నారు. నైజీరియా అంతటా ఆయనకు 70కి పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి.

ఇదే సమయంలో సుమారు 350కి పైగా ట్రక్కులు, అజ్మాన్ రైస్ ఫామ్ & మిల్స్ ను నిర్వహించడంతోపాటు.. అజ్మాన్ ఫౌండేషన్ తో దాతృత్వ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఇలా.. విద్య, వ్యవసాయం, విమానం, పవర్, రవాణా, సోషల్ సర్వీస్ వంటి వివిధ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిన ఆయన... నికర సంపద సుమారు 5 బిలియన్ డాలర్లని అంచనా!