ప్రభుత్వం పట్టించుకోకపోతే.. ప్రజలే తిరగబడతారు: మాజీ ఐపీఎస్
ఏపీకి చెందిన మాజీ ఐపీఎస్ అధికారి, వైసీపీ హయాంలో ఇబ్బందులు పడిన ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా సంచలన ఆరోప ణలు చేశారు.
By: Tupaki Desk | 24 July 2025 9:26 AM ISTఏపీకి చెందిన మాజీ ఐపీఎస్ అధికారి, వైసీపీ హయాంలో ఇబ్బందులు పడిన ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా సంచలన ఆరోప ణలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు అనేక ఇబ్బందులు పడిన, అనేక అరాచకాలకు గురైన ప్రజలు మంచి ప్రభుత్వం రావాలని గత ఎన్నికల్లో ఓటేసి గెలిపించారని.. అయితే.. ప్రభుత్వం మారినా.. కూడా ప్రజలకుఎక్కడా సంతోషం కనిపించ డం లేదన్నారు. వైసీపీ నుంచి కొందరు గూండాలు.. పార్టీ మారి అధికార పార్టీలోకి చేరి.. అరాచకాలను, దాడులను కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాజాగా ఓ ప్రభుత్వ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్టాడారు. ఈ సందర్భంగా పలువురు బాధిత మహిళల పక్షాన వెంకటేశ్వరరావు మాట్లాడారు.
వైసీపి గూండాలు పార్టీ మారి అచ్చోసిన ఆంబోతుల్లా ప్రజలపై పడుతున్నారని వెంకటేశ్వరరావు అన్నారు. పార్టీ మారినంత మా త్రాన ఆంబోతులు, ఆవులైపోవు కదా.. ఈ విషయాన్ని పార్టీలు ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. మహిళలు అనికూడా చూడకుండా దాడులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గత వైసీపీ హయాంలో ఐదేళ్లు దోచుకున్నారని.. ప్రజలను భయ భ్రాంతు లకు గురి చేశారని అన్నారు. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తి కొనసాగుతోందన్నారు. ప్రజలను భయ భ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని చెప్పారు. అంతేకాదు.. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసులు కూడా వైసీపీ నుంచి వచ్చిన గూండాలకు దాసోహం చేస్తున్నాయని.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం, నాయకులు చర్యలు తీసుకోకపోతే... బాధిత ప్రజలే చాటలు, చీపుర్లతో తిరగబడే రోజు వస్తుందని మాజీ డీజి ఎబి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. దీనిని చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన కొందరి పేర్లు చెబుతూ.. వారంతా వైసీపీ హయాంలో గూండాల మాదిరిగా వ్యవహరించారని అన్నారు. వారి పీడ నుంచి ప్రజలు బయట పడాలన్న ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకున్నారని.. కానీ, వారే ఇప్పుడు పార్టీలు మారి.. ప్రజలను నంజుకు తింటున్నారని అన్నారు. ప్రతి పనికీ దోపిడీ చేస్తున్నారని అన్నారు.
అన్నింటిలోనూ కమీషన్లు వసూలు చేసుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంలో కళ్లు తెరవకపోతే.. సంబంధిత మంత్రులు స్పందించకపోతే.. ప్రజలే తిరగడే రోజులు వస్తాయని వ్యాఖ్యానించారు. చీపుర్లు, చాటలతో ప్రజలు తిరబడతారని హెచ్చరించారు. కొన్ని స్వయం సహాయక బృందాల మహిళలకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేసింది. అయితే.. వీటి విషయంలో నకిలీ గ్రూపులు ఉన్నాయంటూ.. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద అలజడి రేగింది. ఈ విషయంలో జోక్యం చేసుకున్న ఓ నాయకుడు మహిళలను బెదిరింపులకు గురి చేశారు. ఇది జరిగి రెండు రోజులు అయింది. తాజాగా వెంకటేశ్వరరావు ఎంట్ర ఇచ్చి.. సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
