Begin typing your search above and press return to search.

'కేసీఆర్‌' కూడా ఓడిపోతున్నారా? స‌ర్వేలు ఏం చెబుతున్నాయంటే!

కామారెడ్డి నుంచి బీజేపీ అభ్య‌ర్థి వెంక‌ట ర‌మ‌ణారెడ్డి విజ‌యం ద‌క్కించుకుంటార‌ని.. ఆరామ‌స్తాన్ స‌ర్వే వెల్ల‌డించింది

By:  Tupaki Desk   |   30 Nov 2023 3:38 PM GMT
కేసీఆర్‌ కూడా ఓడిపోతున్నారా?  స‌ర్వేలు ఏం చెబుతున్నాయంటే!
X

తెలంగాణ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఓడిపోతున్నారా? ఆయ‌న‌కు ఘోర ప‌రాభ‌వం ఎదురు కానుందా? అంటే.. ఔన‌నే అంటున్నాయి స‌ర్వే సంస్థ‌లు. తాజాగా వెల్ల‌డైన స‌ర్వేల్లో కేసీఆర్‌కు కామారెడ్డిలో ప‌రాజ యం ఖాయ‌మ‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత‌ సీఎం కేసీఆర్‪‌కే ఓటమి తప్పదని 'ఆరా మస్తాన్' సర్వే వెల్లడించింది. నిజానికి కామారెడ్డిని కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కేందుకు సెంటిమెంటును కూడా అస్త్రంగా మార్చుకున్నారు.

అయితే.. ఆయ‌న గెలుపు క‌ష్ట‌మేనని స‌ర్వేలు చెబుతున్నాయి. ఇదిలావుంటే, బీఆర్ ఎస్ అధినేత సంప్ర‌దా యంగా పోటీ చేస్తూ .. వ‌స్తున్న గ‌జ్వేల్‌లోనూ.. ఒకింత త‌డ‌బాటు త‌ప్ప‌ద‌నే స‌ర్వేలు చెబుతున్నాయి. ఇక్క‌డ గెలిచినా. . భారీ మెజారిటీ అయితే వ‌చ్చే అవ‌కాశం లేద‌ని వెల్ల‌డించాయి. గెలుపు మాత్రం ప‌క్కా అని వెల్ల‌డించాయి. ఇక‌, కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి ప‌రిస్థితి కూడా ఇలానే ఉంద‌ని స‌ర్వేలు చెప్పాయి. ఆయ‌న కూడా ఓడిపోబోతున్నార‌నేది స‌ర్వేల మాట‌.

కామారెడ్డి నుంచి బీజేపీ అభ్య‌ర్థి వెంక‌ట ర‌మ‌ణారెడ్డి విజ‌యం ద‌క్కించుకుంటార‌ని.. ఆరామ‌స్తాన్ స‌ర్వే వెల్ల‌డించింది. క్షేత్ర‌స్థాయిలో 5000 మంది నుంచి సేక‌రించిన ఫ‌లితాల‌ను తాజాగా ఈ సంస్థ వెల్ల‌డించింది. కేసీఆర్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న రెండు స్థానాల్లోనూ నిజానికి గ‌జ్వేల్‌పై ఉన్న బెంగ‌తోనే కామారెడ్డిని ఎంచుకున్నారు. కానీ, గ‌జ్వేల్‌లో గెలుస్తున్నార‌ని.. కామారెడ్డిలో ఓడుతున్నార‌ని ఎగ్జిట్ పోల్ చెప్ప‌డంతో బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.