నా మాజీ భార్యలతో గొడవలేవీ లేదు.. మీకేంటి ప్రాబ్లెమ్?
60 వయసులో మూడోసారి ప్రేమలో పడ్డాడు అమీర్ ఖాన్. ముచ్చటగా గాళ్ ఫ్రెండ్ తో మూడో పెళ్లికి రెడీ అవుతున్నాడు.
By: Tupaki Desk | 28 Jun 2025 12:00 AM IST60 వయసులో మూడోసారి ప్రేమలో పడ్డాడు అమీర్ ఖాన్. ముచ్చటగా గాళ్ ఫ్రెండ్ తో మూడో పెళ్లికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరు యువతి గౌరీ స్ప్రాట్ తో అతడి పబ్లిక్ ఔటింగులు చర్చగా మారాయి. అయితే తన జీవిత కాలంలో ఇద్దరు భార్యలకు విడాకులిచ్చి, మరో యువతితో ప్రేమలో పడటం అనేది నిజంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
మునుపటి భార్యల గురించి సహజంగానే మీడియా అతడిని ప్రశ్నిస్తుంది. విసిగించే వ్యవహారమే అయినా అమీర్ ఖాన్ అన్నిటినీ భరిస్తూ మీడియాకు జవాబులిస్తున్నాడు. ఇప్పుడు కూడా అతడి మాజీ భార్యల గురించి ప్రశ్న ఎదురైంది. 60 ఏళ్ల వయసులో అతడి కొత్త ప్రేమను జనం ప్రశ్నిస్తున్నారు.
అయితే తన మునుపటి భార్యలతో తనకు ఎలాంటి సమస్యా లేదని, మీకే ఎందుకు సమస్య? అన్నట్టుగా అమీర్ ఖాన్ చాలా తెలివిగా మాట్లాడాడు. రీనా, కిరణ్‌తో తన విడాకులు సామరస్యంగా జరిగాయని గొడవలు చేదు అనుభవాలు లేవని తెలిపాడు. పరస్పర అంగీకారంతో విడిపోయి స్నేహితులుగా కొనసాగుతున్నాము. విచారణలను చూసుకోవడానికి వారికి ఒకే న్యాయవాది ఉన్నారు.. ప్రాసెస్ లో ఎలాంటి వికారాలు లేవని అన్నాడు. అమీర్ ఖాన్ నటించిన సీతారే జమీన్ పార్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అమీర్ ఖాన్ అరవై వయసులో ప్రేమలో పడడాన్ని అభిమానులు సమర్థిస్తున్నారు. దేనిని ఆపినా వయసును ఆపలేమని అంటున్నారు.
