Begin typing your search above and press return to search.

శభాష్ జగన్ సర్కార్ : ఆడుదాం ఆంధ్రా సంబరానికి రిజిస్ట్రేషన్లు స్టార్ట్

ఏపీ వ్యాప్తంగా మొత్తం లక్షా యాభై వేల సచివాలయాల పరిధిలో నిర్వహించే ఈ క్రీడలకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది.

By:  Tupaki Desk   |   27 Nov 2023 9:45 AM GMT
శభాష్ జగన్ సర్కార్  : ఆడుదాం ఆంధ్రా సంబరానికి రిజిస్ట్రేషన్లు స్టార్ట్
X

ఏపీ ప్రభుత్వం గ్రౌండ్ లెవెల్ లో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఆడుదాం ఆంధ్రా పేరుతో అతి పెద్ద క్రీడా సంబరాన్ని నిర్వహిస్తోంది. ఏపీ వ్యాప్తంగా మొత్తం లక్షా యాభై వేల సచివాలయాల పరిధిలో నిర్వహించే ఈ క్రీడలకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది.

ఏపీలో 15 ఏళ్ళు నిండిన యువతను ప్రోత్సహించేందుకు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసేందుకు పెద్ద ఎత్తున క్రీడలను నిర్వహిస్తున్నట్లుగా ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ తెలిపింది. గ్రామీణ ప్రాంతాలలో అద్భుతమైన క్రీడాకారులను వారి ప్రతిభను వెలికి తీసేందుకు ఈ మెగా స్పోర్ట్స్ టోర్నమెంట్ ని ప్రారంభిస్తున్నట్లుగా సంస్థ పేర్కొంది.

రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ 15 నుంచి మొదలయ్యే ఈ మెగా క్రీడా సంబరాలు 2024 ఫిబ్రవరి 3 వరకూ సాగుతాయని వెల్లడించింది. క్రికెట్ వాలీబాల్, బాడ్మింటన్, కబడ్డీ, ఖో ఖో వంటి అయిదు క్రీడలలో పోటీలు ఉంటాయి. అలాగే పోటీలు లేని క్రీడలలో యోగా టెన్నీకాయిట్, మారధాన్ ఉంటాయి.

ఏకంగా 51 రోజుల పాటు ఏపీవ్యాప్తంగా 15 వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఆడుదాం ఆంధ్రా లక్షా 50 వేల పోటీలు జరుగుతాయి. అలాగే 680 మండలాల్లో లక్షా నలభై రెండు వేల మ్యాచులు జరుగుతాయి. 175 నియోజకవర్గాలలో 5 వేల 250 మ్యాచులు జరుగుతాయి. 26 జిల్లాలలో 312 మ్యాచులు నిర్వహిస్తారు. చివరిగా రాష్ట్ర స్థాయిలో 250 మ్యాచులు జరుగుతాయి. ఇలా మొత్తంగా కలుపుకుంటే అన్ని స్థాయిలల్లో కలుపుకుని 2.99 లక్షల మ్యాచులు నిర్వహిస్తారు.

ఇలా గ్రామాల్లో గెలిచిన జట్టు మండలాలకు ఆ తరువాత నియోజకవరాలకు అక్కడ నుంచి జిల్లాల స్థాయిలో చివరిగా రాష్ట్ర స్థాయి దాకా పోటీలు ఉంటాయి. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ట్రోఫీలు, సర్టిఫికేట్లు, పతకాలు అందిస్తారు. ఇక నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలలో గెలుపొందిన వారికి నగదు బహుమతులు కూడా ఉంటాయి.

ఇక ఈ పోటీలలో అయిదు అంశాలకు సంబంధించిన క్రీడా సామగ్రిని మొత్తం ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఇక ఈ పోటీలు ఫిబ్రవరి 3న విశాఖపట్నంలో ముగుస్తాయి. వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి విధి విధానాలు కూడా సూచించారు. 15 ఏళ్ళు నిండిన వారు నేరుగ్స సచివాలయాలకు వెళ్ళి తమ పేర్లను నమోదు చేసుకోవాలి. అలాగే ఆన్ లైన్ లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక రిజిస్ట్రేషన్ కోసం 1902 నంబర్ కి కాల్ చేయాలని సూచిస్తున్నారు.

మొత్తానికి అతి పెద్ద క్రీడా సంబరానికి జగన్ ప్రభుత్వం తెర తీసింది.గతంలో ఎపుడూ ఎవరూ చేయని విధంగా ఈ ప్రభుత్వం చేస్తోంది. క్రీడల పట్ల ఆసక్తి ఉన్నా కూడా కనీస స్తోమత లేని వారి విషయంలో ఇపుడు ప్రభుత్వం అందిస్తున్న సాయం కానీ ఊతం కానీ చాలా గొప్పది అని చెప్పక తప్పదు అని అంటున్నారు. శభాష్ జగన్ సర్కార్ అని క్రీడా నిపుణుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి.