చనిపోయిన వారి ఆధార్ కార్డులు ఎందుకు యాక్టివ్ గా ఉన్నాయి.. వెలుగులోకి సంచలన విషయాలు
గతంలో (16 సంవత్సరాల క్రితం) కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఆధార్ ప్రోగ్రామ్ ను తీసుకువచ్చింది.
By: Tupaki Desk | 16 July 2025 8:00 PM ISTగతంలో (16 సంవత్సరాల క్రితం) కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఆధార్ ప్రోగ్రామ్ ను తీసుకువచ్చింది. ఇది భారత ప్రభుత్వం తమ దేశ పౌరులకు అందించే విశిష్ట గుర్తింపు సంఖ్య. పుట్టి తర్వాత ఏడాది లోపు శిశువు నుంచి చనిపోయే వరకు ఆధార్ నెంబర్ ఉండాల్సిందే. ఈ నెంబర్ తో ప్రభుత్వాలు చాలా ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా.. విద్యా, వైద్యం, బ్యాంకులు, ఇంకా చాలా సంస్థల్లో ఆధారే కీలకం చేసింది. కొన్ని కొన్ని తీర్పుల్లో కోర్టు ఆధారే ప్రామాణికం కాదని చెప్పినా గుర్తింపు కోసం ప్రభుత్వాలు మాత్రం దాన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ప్రభుత్వమే కాదు.. ప్రైవేట్ సంస్థలు కూడా దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. అయితే ఇందులో చాలా లోపాలు ఉన్నాయని అప్పుడప్పుడూ బయటపడుతుంది. ముఖ్యంగా బార్డర్ సమీపంలోని రాష్ట్రాల్లో సమీప దేశస్తులు దొంగతనంగా చొరబడి ఫేస్ ఆధార్ రూపొందించుకుంటున్నారు.
ఇటీవల ఆధార్ కార్డుల విషయంలో సంచలన విషయం బయటపడ్డాయి. చనిపోయిన వారి ఆధార్ కార్డులు యాక్టివ్ గా ఉన్నట్లు వెల్లడైంది. ఇది ప్రభుత్వాన్ని, ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. దేశంలో ఆధార్ కార్డు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కేవలం 1.15 కోట్ల కార్డులు మాత్రమే ఇప్పటి వరకు డీ యాక్టివేట్ చేశారు. ఈ విషయాన్ని ఉడాయ్ (UIDAI) వెల్లడించింది. దేశ వ్యాప్తంగా కోట్లాది మంచి చనిపోయినా కేవలం 1.15 కోట్ల కార్డులు మాత్రమే డీ యాక్టివేట్ అయితే.. మిగిలిన కార్డుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం అవుతోంది. సమాచార హక్కు చట్టం కింద ఒక వ్యక్తి దాఖలు చేయగా ఉడాయ్ ఈ విషయాన్ని వెల్లడించిందని ఓ జాతీయ మీడియా ప్రచురించింది.
ఆధార్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి జూన్, 2025 వరకు 142.39 కోట్ల ఆధార్ కార్డులు యాక్టివ్ గా ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) డేటా ప్రకారం దేశ జనాభా 146.39 కోట్లు. ఇంకా సివిల్ రిజిస్ట్రేషన్ (CSR) ప్రకారం 2007 - 2019 వరకు ఏటా 83.5 లక్షల మంది మరణిస్తున్నారు. ఇలా లెక్కిస్తే సుమారుగా 9 కోట్లకు పైగా ఉంటారు. అంటే దేశంలో 9 కోట్ల ఆధార్ కార్డులు డీ యాక్టివేట్ చేయాలి. కానీ ఇప్పటి వరకు కేవలం కోటి పదిహేను లక్షలు (1.15 కోట్లు) మాత్రమే తొలగించారు. శాతం పరంగా చూసుకుంటే కేవలం 10 శఆతం కంటే తక్కువగానే కనిపిస్తుంది. అయితే మరణ ధృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుల దరఖాస్తుల ఆధారంగా తొలగిస్తామని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దారుడికి ఉడాయ్ వివరించింది.
వ్యత్యాసంపై ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ, ప్రైవేట్ తదితర అన్ని పనులకు సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డే ప్రామాణికం. కాబ్టటి ప్రతి ఏటా దాదాపు 80 లక్షలకు పైగా ఆధార్ కార్డులు యాక్టివేట్ చేయకపోతే వాటితో అనర్హులు ప్రభుత్వ పథకాల లబ్ధిపొందుతున్నారని, కార్డులు కూడా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. దీన్ని నివారించేందుకు జనన, మరణ విషయాలు ఆధార్ డేటాబేస్ నిర్వహణలో సమన్వయం ఉండాల్సిన అవసరం ఉందని వారు వివరించారు.
