బాల ఆధార్ నుంచి ప్రభుత్వం ఎందుకు మార్చతుంది..? ఈ మార్పు అంత అవసరమా..!
ప్రతి భారతీయుడికి గుర్తింపు ఉండాలని గతంలో యూపీఏ ప్రభుత్వం ఆధార్ (UIDAI)ను తీసుకువచ్చింది.
By: Tupaki Desk | 16 July 2025 1:00 PM ISTప్రతి భారతీయుడికి గుర్తింపు ఉండాలని గతంలో యూపీఏ ప్రభుత్వం ఆధార్ (UIDAI)ను తీసుకువచ్చింది. దీనితో ప్రతి భారతీయుడు ఆధార్ ను తీసుకోవాలని తప్పనిసరి చేసింది. ఒక్కో సారి కోర్టులు ఆధార్ తప్పనిసరి కాదని చెప్తున్నా.. బర్త్ నుంచి డెత్ వరకు దాదాపు అన్నింటికి ప్రభుత్వం ఆధార్ ను లింక్ చేసింది. ఇలా లింక్ చేయడంలో దీని విశిష్టత ఎంటో మనకు అర్థం అవుతుంది. ఆధార్ లో పౌరుడికి సంబంధించి పూర్తి పూర్తి వివరాలు నమోదు అవుతాయి. కంటి నుంచి వేలి ముద్రల వరకు సేకరిస్తారు. దీని వల్ల చాలా మేలు కలుగుతుంది. సరే ఆ మేలు గురించి తర్వత చూద్దాం. కానీ ఆధార్ అనేది పుట్టిన పిల్లల నుంచి చనిపోయే ముసలి వారి వరకు అవసరం అని అర్థం అవుతుంది. అయితే అందులో కూడా పరిస్థితులను బట్టి కేంద్రం కొన్ని కొన్ని మార్పులను నిర్ణయిస్తుంది.
తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత నెల నుంచి ఆరు నెలల వ్యవధిలో ఆధార్ తీసుకోవాలి. ఆ సమయంలో చిన్నారుల వేలి ముద్రలు తీసుకునే విషయంలో ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి ఆ సమయంలో కేవలం ఒక ఫొటోతో మాత్రమే అధార్ తీసుకునే అవకాశాన్ని భారత ప్రభుత్వం కల్పించింది. ఈ యూఐడీఏఐ నెంబర్ వారి టీకాలు, మందులు, ఇంకా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ తదితర వాటిల్లో ఉపయోగించుకోవచ్చు. తల్లికి, శిశువుకు ప్రభుత్వం అందించే పథకాలు అమలు విషయంలో వీటిని ప్రధానంగా ఉపయోగిస్తారు. వీరు పెరిగి పెద్దవుతుంటే ఆధార్ కూడా మారుతుంది. యూఐడీఏఐ నెంబర్ ఒకటే ఉన్నా.. వారి వివరాలు మారుతుంటాయి.
బాల ఆధార్ తర్వాత చిన్నారి యొక్క మరిన్ని వివరాలతో ఆధార్ ను అప్ డేట్ చేస్తారు. ఇక ఇందులో కనుపాప నుంచి చేతి వేళ్ల ముద్రలు వరకు తీసుకొని అప్ డేట్ చేస్తారు. అయితే దీని కోసం ఇటీవల కేంద్రం ఒక సూచన చేసింది. బాల ఆధార్ తీసుకున్న వారు ఐదేళ్ల తర్వాత రెన్యూవల్ చేసుకోవాలని చెప్పింది. దీని ఆధారంగా బాల ఆధార్ తీసుకున్న వారి ఫోన్ నెంబర్ కు మెసేజ్ పంపించింది. గతంలో కేవలం ఒకే ఫొటోతో విశిష్ట గుర్తింపు సంఖ్య తీసుకున్న వారు ఐదేళ్ల తర్వాత మార్చుకోవాలని సందేశం వివరించింది. ఇది ఏడేళ్ల వరకు ఉచితమని పేర్కొంది. ఏడేళ్లు దాటితో కొంత డబ్బు చెల్లించాలని సూచించింది.
దీని కోసం సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లాలని కేంద్ర తెలిపింది. ఇది పూర్తిగా ఉచితమని చెప్పింది. ఏడేళ్ల లోపు వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని ప్రకటించింది. ఏడేళ్లు దాటిన పిల్లలకు రూ. 100 తీసుకొని అప్ డేట్ చేస్తారని కేంద్రం స్పష్టంగా వివరించింది. ఈ నేపథ్యంలో చిన్నారుల తల్లిదండ్రులు కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు.
