ఏపీలో దేవుళ్లకు ఆధార్ కష్టాలు.. అదెలానంటే?
దీనికి పరిష్కారంగా ప్రతి గుడి పేరుతో ఆధార్ నెంబరు ఇస్తే తప్పించి సమస్య పరిష్కారం కాదని ఏపీ రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
By: Tupaki Desk | 19 July 2025 2:00 PM ISTఆంధ్రప్రదేశ్ లోని దేవుళ్లకు కొత్త సవాల్ ఎదురవుతోంది. ఎందుకంటే.. రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి రైతుకు ఆధార్ ఉండటమే. ఎందుకంటే.. ఈ భూములకు సంబంధించిన రికార్డును వెబ్ ల్యాండ్ లో చేర్చి.. ఆ భూమిని తన ఆధార్ తో అనుసంధానం చేయటం తెలిసిందే. ఈ సీడింగ్ చేయటం ద్వారా వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. రాయితీలు దక్కుతున్న సంగతి తెలిసిందే. మనుషులకైతే ఆధార్ ఉంటుంది. మరి దేవేళ్ల మాటేంటి? ఏపీ వ్యాప్తంగా లక్షలాది దేవుళ్లు.. దేవాలయాలకు ఉన్న ఎకరాలు వెబ్ ల్యాండ్.. పీఎం కిసాన్ పోర్టల్.. అన్నదాత సుఖీభవలో చేర్చాలంటే ఆధార్ తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే.
తన పేరుతో ఉన్న భూములను వెబ్ ల్యాండ్ తో అనుసంధానం చేసుకోవటం ఎలా? కనిపించని దేవుడు దిగి రావాలా? భూముల ఈకేవౌసీలో వచ్చిన ఈ సరికొత్త సమస్యకు పరిష్కారం ఏమిటన్నది రెవెన్యూ శాఖకు అంతుపట్టనిదిగా మారింది. దీంతో.. ఇదో ఇష్యూ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి పరిష్కారంగా ప్రతి గుడి పేరుతో ఆధార్ నెంబరు ఇస్తే తప్పించి సమస్య పరిష్కారం కాదని ఏపీ రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీలోని ప్రభుత్వ.. ప్రైవేటు భూముల వివరాలన్ని వెబ్ ల్యాండ్ లో రికార్డు చేయటం తెలిసిందే. ఇలా డిజిటలైజ్ చేసిన వివరాల్ని ఆయా రైతుల మొబైల్ నెంబర్లతో అనుసంధానం చేశారు. ఈ డేటా ఆధారంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలైన పంట పెట్టుబడి.. రాయితీలు.. పంట నష్టపరిహారం.. ఇన్ పుట్ సబ్సిడీ లాంటి ప్రయోజనాలు రైతుల ఖాతాల్లోనే నేరుగా పడటం తెలిసిందే. ఇలాంటి వేళ.. దేవుడి భూముల విషయంలో ఏం చేయాలన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏపీ వ్యాప్తంగా దేవుళ్ల పేరు మీద 3.48 లక్షల ఎకరాల భూమి ఉంది.
కొందరు అధికారులు మాత్రం.. కొన్ని ఆలయ భూములను వెబ్ ల్యాండ్ లో నమోదు చేశారు. ఆలయ భూములను.. వేంకటేశ్వరస్వామి.. శివయ్య స్వామి.. గణపతి స్వామి..ఆంజనేయ స్వామి పేర్లతో వెబ్ ల్యాండ్ లో దేవుళ్ల పేరుతో వెబ్ ల్యాండ్ లో నమోదు చేశారు. హక్కుదారుల కింద ఆలయాల్లోకైంకర్యాలు చేసే అర్చకుల పేర్తు రాసి.. వారి ఆధార్ నెంబర్లను సీడింగ్ చేశారు. ఇలా చేయటం ద్వారా.. అర్చకుల పేరు మీద 20 - 60 ఎకరాల భూమి ఉండటంతో ఆర్చకులు ఎవరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఇతర ప్రయోజనాలు అందని దుస్థితి.
ఈ విషయాన్ని గుర్తించిన అర్చకులు పేలువురు దేవుడి మాన్యం భూములకు తమ పేరుతో ఉండటంతో తాము ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులుగా మారటంతో.. తమ పేరు మీద ఉన్న భూముల పేర్లను తొలగించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేవుడి ఆలయాలకు ఆధార్ ఎలా అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. గుడుల పేరుతో ఆధార్ ఇవ్వటం సమస్యకు పరిష్కారమని చెప్పినా.. మొబైల్ నెంబరుతో అనుసంధానం ఎలా? అన్నదిప్పుడు మరో సమస్యగా మారింది. లేదంటే.. ఏపీలోని దేవాలయాల భూములను ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఏమైనా.. దేవుడికి కొత్త తరహా కష్టం ఏపీలో ఎదురైందని చెప్పక తప్పదు.మరి.. ఈ విషయంలో ఏపీలోని కూటమి సర్కారు ఎలాంటి పరిష్కారాన్ని చూపుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
