Begin typing your search above and press return to search.

2 ఏళ్లలో 93 వేల మంది మహిళలు మిస్సింగ్.. మహారాష్ట్రలో ఏం జరుగుతోంది?

మహారాష్ట్రలోని మహిళల మిస్సింగ్ ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

By:  Garuda Media   |   25 Feb 2026 10:22 AM IST
2 ఏళ్లలో 93 వేల మంది మహిళలు మిస్సింగ్.. మహారాష్ట్రలో ఏం జరుగుతోంది?
X

మహారాష్ట్రలోని మహిళల మిస్సింగ్ ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాల్ని చూస్తే.. గడిచిన రెండేళ్లలో ఏకంగా 93 వేల మంది మహిళలు కనిపించకుండా పోయిన వైనం షాకింగ్ గా మారింది. పద్దెనిమిదేళ్ల వయసు దాటిన వారు ఇంత భారీగా మిస్ అవుతున్న వైనాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం వెల్లడించింది.

మహారాష్ట్ర అసెంబ్లీలో వెల్లడించిన తాజా రిపోర్టు ప్రకారం చూస్తే.. ప్రతి రోజు సగటున 129 మంది మహిళలు కనిపించకుండా పోతున్నారని.. వీరిలో 72 శాతం మంది తర్వాత గుర్తిస్తున్నట్లుగా పేర్కొన్నారు. వీటికి సంబంధించిన కేసులు పరిష్కారం అవుతున్నా.. వేలాది కేసులు మాత్రం ఒక కొలిక్కి రావటం లేదన్నారు. 2024లో 45,662 మంది మహిళలు కనిపించకుండా పోతే.. వారిలో 30,887 మందిని గుర్తించామన్నారు. మైనర్లకు సంబంధించి 2024లో 11,316 మంది మిస్ అయితే వారిలో 8475 మందిని గుర్తించినట్లు తెలిపారు.

2025లో మిస్ అయిన మహిళల సంఖ్య మరింత పెరిగిందని పేర్కొంటూ.. ‘‘48,278 మంది మిస్ అయితే వారిలో 75.8 శాతం మందిని గుర్తించారు’’ అని పేర్కొన్నారు. మహిళలు.. అమ్మాయిలు ఎక్కువగా తప్పిపోవటంపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. మిస్ అయిన వారి సామాజిక నేపథ్యాలు. .వారి ఆర్థిక నేపథ్యంతో పాటు.. వారెంత వరకు చదువుకున్నారు? లాంటి అంశాలపై ఫోకస్ చేసి.. మిస్సింగ్ వెనుకున్న మిస్టరీని చేధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.