80 శాతం చంద్రబాబు వైపే.. విషయం ఏంటంటే!
సీఎం చంద్రబాబుకు మద్దతుగా గళం వినిపించేందుకు పార్టీ నాయకులు ఉన్నారు. కార్యకర్తలు ఉన్నారు. ఐటీ విభాగం కూడా.. ఉంది.
By: Tupaki Desk | 25 April 2025 6:00 PM ISTసీఎం చంద్రబాబుకు మద్దతుగా గళం వినిపించేందుకు పార్టీ నాయకులు ఉన్నారు. కార్యకర్తలు ఉన్నారు. ఐటీ విభాగం కూడా.. ఉంది. అయితే, తాజాగా నిర్వహించిన ఓ ప్రైవేటు సంస్థ సర్వేలో ఏపీలోని మీడియా సంస్థల్లో 80 శాతం వరకు చంద్రబాబుకు మద్దతుగా ఉన్నట్టు తేలింది. ఇది చిన్న విషయమని కొట్టి పారే సేందుకు వీలు లేదని.. సర్వే చెప్పడం గమనార్హం. గతంలోనూ మీడియాను మేనేజ్ చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డికి అప్పట్లో 45-55 శాతం వరకు మాత్రమే మీడియా అండగా నిలిచిందని సర్వే పేర్కొంది.
ఇక, ఆది నుంచి కూడా.. అంటే.. టీడీపీలో సంక్షోభం ఏర్పడి.. ఆ పార్టీ పగ్గాలను చంద్రబాబు చేపట్టిన త ర్వాత నుంచి ఓ వర్గం మీడియా ఇప్పటి వరకు చంద్రబాబు పక్షానే నిలబడినట్టు సర్వే తెలిపింది. దీనిలో ప్రధాన పత్రికలు, చానెళ్లు ఉన్నాయని పేర్కొంది. అయితే.. వీటితోపాటు.. ఇప్పుడు వెబ్ సైట్లు సహా.. పలు సామాజిక మాధ్యమాలు. కూడా చంద్రబాబుకు మద్దతుగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. యూట్యూబ్ ఆవిర్భావం, వాడుక మరింత పెరిగిన దరిమిలా.. సొంత ఛానెళ్లు ఏర్పాటు చేసుకున్న వారు పెరిగారు.
అయితే.. వీరిలోనూ 80 శాతం మంది వ్యక్తిగత చానెళ్ల నిర్వాహకులు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న ట్టు సర్వే పేర్కొనడం విశేషం. 2024 ఎన్నికలకు ఏడాది ముందు వరకు రాష్ట్రంలో 550 వ్యక్తిగత చానెళ్లు ఉన్నాయని.. ఇప్పుడు ఆ సంఖ్య 2202 కు చేరిందని సర్వే వివరించింది. వీరిలో రాజకీయ విశ్లేషకులు.. ప్రొఫెసర్లు, రాజకీయ నాయకులు, సామాజిక వుద్యమ కారులు ఇలా.. అనేక వర్గాలకు చెందిన వారు ఉన్నారని తెలిపింది. వీరంతా.. ప్రత్యక్షంగా లేదా.. పరోక్షంగా చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారు.
ఇక, వైసీపీని అనుసరించే చానెళ్లు కూడా ఉన్నాయని సర్వే పేర్కొంది. అయితే.. వీటి సంఖ్య చాలా వరకు తగ్గినట్టు తెలిపింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. 600 చానెళ్లు వైసీపీ కి అనుబంధంగా పనిచేయగా.. ప్రస్తుతం వీటి సంఖ్య 200లలోపునకు పడిపోయినట్టు తెలిపింది. ఇవి కూడా స్వచ్ఛందంగా మాత్రమే పనిచేస్తున్నట్టు పేర్కొనడం గమనార్హం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను విశ్లేషించేవారు చంద్రబాబు మద్దతుగానే వ్యవహరిస్తున్నారని.. చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీ మీడియా పాత్ర తగ్గిపోయిందని.. సర్వే వివరించింది.
