Begin typing your search above and press return to search.

ఆహారం కోసం చూస్తున్న వారి పై కాల్పులు.. గాజాలో 51 మంది మృతి!

అవును... ఓ వైపు ఇరాన్ తో భీకర యుద్ధ చేస్తోన్న ఇజ్రాయెల్ సైన్యం.. మరోవైపు హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా యుద్ధం మొదలుపెట్టిన గాజానూ వదలడం లేదు.

By:  Tupaki Desk   |   17 Jun 2025 4:22 PM IST
ఆహారం కోసం చూస్తున్న వారి పై కాల్పులు.. గాజాలో 51 మంది మృతి!
X

గత కొంతకాలంగా హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా గాజాను గడగడలాడించిన ఇజ్రాయెల్.. ఇప్పుడు పూర్తి కాన్సంట్రేషన్ ఇరాన్ పై పెట్టింది. గత గురువారం రాత్రి నుంచి ఇరాన్ పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. అక్కడున్న అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. అలా అని గాజాను వదిలిపెట్టడం లేదు. ఇక్కడ చేసే పని ఇక్కడా చేస్తోంది!

అవును... ఓ వైపు ఇరాన్ తో భీకర యుద్ధ చేస్తోన్న ఇజ్రాయెల్ సైన్యం.. మరోవైపు హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా యుద్ధం మొదలుపెట్టిన గాజానూ వదలడం లేదు. ఇందులో భాగంగా... తాజాగా ఐక్యరాజ్యసమితి, వాణిజ్య ట్రక్కులు ఆహారంతో వస్తుండగా.. వాటి కోసం వేచి చూస్తున్న శరణార్థులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులకు తెగబడినట్లు చెబుతున్నారు.

అక్కడ శరణార్థులు పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో ఆ కాల్పుల్లో సుమారు 51 మంది మరణించగా.. 200 మందికి పైగా గాయపడ్డారని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు స్థానిక వైద్యాధికారులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్పందించిన ప్రత్యక్ష సాక్షులు షాకింగ్ విషయాలు చెప్పారు. ఇందులో భాగంగా... ఆహారం తెచ్చే ట్రక్కుల కోసం వేచి ఉన్న జనసమూహాలపై ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపాయని పాలస్తీనియన్ ప్రత్యక్ష సాక్ష్యులు అసోసియేటెడ్ ప్రెస్ తో అన్నారు. ఇదే సమయంలో.. భారీ కాల్పులు, ట్యాంక్ దాడుల తర్వాత పెద్ద శబ్దం వినిపించిందని మరో ప్రత్యక్ష సాక్షి అన్నారు.

అదేవిధంగా... ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపిన తర్వాత చాలా మంది చలనం లేకుండా, నేలపై రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్నట్లు తాను చూశానని ఇంకో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఇది ఒక ఊచకోత అని.. ఆ ప్రాంతం నుంచి పారిపోతున్న ప్రజలపైనా సైన్యం కాల్పులు జరిపిందని పేర్కొన్నారు.

కాగా... ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడి సామాన్యుల ఆకలి కేకలు మిన్నంటుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం ఇజ్రాయెల్ ఎవరి మాటా వినడం లేదు. తమ పౌరులను ఊచకోత కోసిన హమాస్ కు చెందిన చివరి ఉగ్రవాదిని మట్టుబెట్టేవరకూ తమ దాడులు ఆగమని ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి!