Begin typing your search above and press return to search.

48 సంవత్సరాల ఒక నెల 18 రోజులు జైలు శిక్ష తర్వాత నిర్ధోషి!

చేయని నేరానికి శిక్ష అనుభవించాడు. ఏ నేరమూ చేయకపోయినా ఏకంగా 48 సంవత్సరాల ఒక నెల 18 రోజులపాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.

By:  Tupaki Desk   |   22 Dec 2023 5:04 AM GMT
48 సంవత్సరాల ఒక నెల 18 రోజులు జైలు శిక్ష తర్వాత నిర్ధోషి!
X

చేయని తప్పుకు నిందలు భరించడం, శిక్ష అనుభవించడానికి మించిన నరకం ఈ భూమిపై లేదని అంటారు. అది అనుభవించిన వారికి మరింత బాగా అర్ధమతుందని చెబుతుంటారు. అందుకే భారతదేశం చట్టాల్లో... 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని చెబుతారు. అయితే అగ్రరాజ్యం అమెరికాలో ఒక ఘోరం జరిగిపోయింది.. అది జరిగిన 48ఏళ్ల తర్వాత అది ఘోరం అని తేలింది!

అవును... అమెరికాలోని ఒక్లహోమాకు చెందిన 70 సంవత్సరాల గ్లిన్‌ సైమన్స్‌ విలువైన జీవిత కాలాన్ని జైలు గొడల మధ్య గడిపాడు. చేయని నేరానికి శిక్ష అనుభవించాడు. ఏ నేరమూ చేయకపోయినా ఏకంగా 48 సంవత్సరాల ఒక నెల 18 రోజులపాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. 70ఏళ్ల వయసుకు వచ్చిన తర్వాత న్యాయదేవత కరుణించింది..! న్యాయం అతడి పక్షాన ఉండడంతో ఎట్టకేలకు నిర్దోషిగా బయటపడ్డాడు.

వివరాళ్లోకి వెళ్తే... అది డిసెంబర్ నెల 1974వ సంవత్సరం. నాడు ఆ క్రిస్మస్ మాసంలో ఒక్లహోమాలోని ఓ లిక్కర్‌ స్టోర్‌ లో హత్య జరిగింది. లిక్కర్‌ స్టోర్‌ క్లర్క్‌ ను కాల్చి చంపిన ఇద్దరు దుండగులు.. అక్కడున్న మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి సైమన్స్‌ తోపాటు డాన్‌ రాబర్ట్స్‌ అనే మరోవ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య వారిద్దరే చేశారని పోలీసులు తేల్చారు. అప్పుడు గ్లిన్‌ సైమన్స్‌ వయసు 22 ఏళ్లు!

ఈ సమయంలో పోలీసుల వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఫలితంగా వారిద్దరికీ న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. దీంతో వారిద్దరినీ పోలీసులు జైలుకు పంపించారు. తాము ఈ నేరం చేయలేదని మొత్తుకున్నా అప్పట్లో ఎవరూ వినిపించుకోలేదు. ఆ సమయంలో న్యాయదేవతకు కళ్లే కాదు చెవులు కూడా ఉండవని వారికి అనిపించి ఉండొచ్చు!

ఈ సమయంలో 2008లో డాన్‌ రాబర్ట్స్‌ పెరోల్‌ పై విడుదలయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ కేసును తిరిగి విచారించాలని కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాడు. దాంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసును మళ్లీ విచారించారు. ఈ విచారణలో అతడు ఈ నేరం చేయలేదని రుజువైంది. దీంతో... అతడిని జైలు నుంచి విడుదల చేయండంటూ ఒక్లహోమా కంట్రీ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది.

దీంతో ఇటీవల సైమన్స్‌ కారాగారం నుంచి బయటకు వచ్చాడు. తాను నేరం చేయలేదు కాబట్టి శిక్షను ధైర్యంగా ఎదుర్కొన్నానని, ఎప్పటికైనా నిర్దోషిగా విడుదలవుతానన్న నమ్మకంతో ఉన్నానని చెప్పాడు. ఈ సమయంలో న్యాయస్థానం అతడికి 1.75 లక్షల డాలర్ల (రూ.1.45 కోట్లు) నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో 48 సంవత్సరాల తర్వాత సైమన్స్ స్వేఛ్చా వాయువులు పీలుస్తున్నాడు!