Begin typing your search above and press return to search.

39 ఏళ్ల మహిళ.. వేర్వేరు తండ్రులతో 20 మందికి జన్మ!

39 ఏళ్ల వయసులోనే 19 మంది పిల్లలను కనడం అసాధ్యం అనుకుంటుంటే.. ఇప్పటివరకు పుట్టిన ఆ 19 మంది పిల్లల్లో 17 మంది 18 ఏళ్లలోపువారే కావడం ఇంకో విశేషంగా మారింది.

By:  Tupaki Desk   |   6 Feb 2024 2:30 PM GMT
39 ఏళ్ల మహిళ.. వేర్వేరు తండ్రులతో 20 మందికి జన్మ!
X

39 ఏళ్ల వయసులోనే ఒక మహిళ ఏకంగా 20 మంది పిల్లలకు జన్మనివ్వడం సాధ్యమేనా అసలు?.. అంతా చెప్పే మాట అసాధ్యం. అయితే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపింది.. కొలంబియాలోని మెడెలిన్‌ కు చెదిన మార్తా. ఆమె ఇప్పటివరకు 19 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె మళ్లీ గర్భిణి. అంటే ఆమె తన 20వ బిడ్డకు జన్మనివ్వనుంది.

39 ఏళ్ల వయసులోనే 19 మంది పిల్లలను కనడం అసాధ్యం అనుకుంటుంటే.. ఇప్పటివరకు పుట్టిన ఆ 19 మంది పిల్లల్లో 17 మంది 18 ఏళ్లలోపువారే కావడం ఇంకో విశేషంగా మారింది.

ఈ నేపథ్యంలో అసలు మార్తా తనకు ఏ వయసు నుంచి పిల్లలకు జన్మనివ్వడం మొదలు పెట్టిందనేది ప్రాధాన్యం సంతరించుకుంది. మార్తా ఇంతమంది పిల్లల్ని కనడానికి కొలంబియా ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. అయితే మార్తా జన్మినిచ్చిన 19 మంది వేర్వేరు తండ్రులకు జన్మించినవారే కావడం ఇక్కడ మరో విశేషం.

కాగా పిల్లలను పెంచడానికి తనకు చాలా వరకు డబ్బు ఖర్చు అవుతుందని మార్తా తెలిపింది. ఈ నేపథ్యంలో మార్తాకు కొలంబియా ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా చేస్తోంది. పెద్ద పిల్లలకు ప్రతి నెల రూ.76 డాలర్లు, చిన్న పిల్లలకు రూ.30.50 డాలర్లు చొప్పున ఇస్తోంది. అలాగే వారి సంరక్షణ బాధ్యతల కోసం నెలకు రూ.500 డాలర్ల ఆర్థిక సాయం అందిస్తోంది. అలాగే ఆమెకు స్థానికంగా ఉన్న ఒక చర్చితోపాటు ఇరుగుపొరుగువారు ఆర్థిక సాయం అందిస్తున్నారు. అయితే పిల్లల పోషణకు తండ్రులు ఆర్థిక సాయం చేయడం లేదట. దీంతో మార్తా వారిపై ఫిర్యాదు చేసింది.

కాగా 20వ బిడ్డకు జన్మినిచ్చాక కూడా ప్రసవించడం ఆపే ఉద్దేశం లేదని మార్తా వెల్లడించడం విశేషం. తన శరీరం సహజంగా గర్భం దాల్చే వరకు పిల్లలను కనాలని కోరుకుంటున్నట్లు మార్తా వెల్లడించింది. గర్భం దాల్చడం, పిల్లల్ని కనడమే తన బాధ్యత అని తెలిపింది.

తనకు పిల్లల్ని కనే సామర్థ్యం ఉన్నంతవరకు పిల్లల్ని కంటూనే ఉంటానని మార్తా తెలిపింది. ఇప్పుడు ఉన్న పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఇంటి నుంచి వెళ్లిపోతారని వెల్లడించింది.

తాను పిల్లలతో మూడు గదుల ఇంట్లో ఉంటున్నానని మార్తా తెలిపింది. ఇంట్లో ఖాళీ సరిపోవడం లేదని.. దీంతో పెద్ద పిల్లవాడు సోఫాలో పడుకోవాల్సి వస్తోందని వివరించింది. పిల్లలందరికీ మంచి పౌష్టికాహారం పెట్టడానికి తాను చాలా కష్టపడాల్సి వస్తోందని మార్తా చెబుతోంది. ప్రభుత్వం, ఇరుగుపొరుగు ఆర్థిక సాయం అందిస్తున్నా అవి సరిపోవడం లేదని వెల్లడించింది. ఇప్పుడు మార్తా విషయం ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అవుతోంది.