ఒంటరిగా ఉన్నానని బాయ్ ఫ్రెండ్ ను పిలిచిన బాలిక.. స్నేహితులతో వచ్చి 9వ తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రే*ప్
గాజియాబాద్‌లోని ఓ హౌసింగ్ సొసైటీలో 9వ తరగతి చదువుతున్న బాలికపై నలుగురు బాలురు సామూహిక అత్యా*చారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
By: Tupaki Desk | 17 July 2025 2:00 PM ISTగాజియాబాద్‌లోని ఓ హౌసింగ్ సొసైటీలో 9వ తరగతి చదువుతున్న బాలికపై నలుగురు బాలురు సామూహిక అత్యా*చారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రైతు నాయకుడి కుమారుడితో పరిచయం ఏర్పడింది. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అతడిని ఇంటికి పిలిచింది. ఆ యువకుడు తనతో పాటు మరో ముగ్గురు స్నేహితులను వెంటబెట్టుకుని బాలిక ఇంటికి వెళ్లాడు. అక్కడ వారంతా కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.ఉదయం నాలుగు గంటల సమయంలో బాలిక తల్లి ఇంటికి తిరిగి రాగా, బాధితురాలు మంచంపై స్పృహ కోల్పోయి పడి ఉంది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నలుగురు నిందితులపై కేసు నమోదు చేయగా, ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితులందరూ మైనర్లే కావడం గమనార్హం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనపై కవినగర్ ఏసీపీ భాస్కర్ వర్మ స్పందించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నలుగురు బాలురపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. "వీరిలో ఒకరు 11వ తరగతి, మరొకరు 10వ తరగతి, మిగిలిన ఇద్దరు 9వ తరగతి చదువుతున్నారు. బాలికను వైద్య పరీక్ష కోసం పంపించాం. ప్రస్తుతం ఆమె స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. నిందితులను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. కేసు విచారణ కొనసాగుతోంది," అని ఏసీపీ వర్మ వెల్లడించారు.
మైనర్లపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి దారుణాలను అరికట్టేందుకు పోలీసు వ్యవస్థ మరింత చురుకుగా వ్యవహరించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
