Begin typing your search above and press return to search.

టెక్ మహామహులకు సవాల్.. ర్యాంకింగ్స్‌లో కనిపించని ఐటీ దిగ్గజాలు

2025 బ్లైండ్ రిపోర్ట్ ర్యాంకింగ్స్ వచ్చేశాయ్. కొన్ని కంపెనీల్లో పనిచేసేవాళ్ల అభిప్రాయాలు, వాళ్ల అనుభవాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   26 April 2025 1:00 PM IST
Top Indian IT Giants Missed Out in the 2025 Blind Report
X

2025 బ్లైండ్ రిపోర్ట్ ర్యాంకింగ్స్ వచ్చేశాయ్. కొన్ని కంపెనీల్లో పనిచేసేవాళ్ల అభిప్రాయాలు, వాళ్ల అనుభవాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇండియాలో పనిచేయడానికి మంచి కంపెనీలేవో, బాగాలేని కంపెనీలేవో ర్యాంకులు ఇచ్చారు. కానీ అసలు విషయం ఏంటంటే.. మన పెద్ద నాలుగు ఐటీ కంపెనీలు - టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో ఈ లిస్టుల్లో ఎక్కడా కనిపించట్లేదు.


టీసీఎస్, ఇన్ఫోసిస్ అంటే ఒక స్టెబిలిటీ, జాబ్ సెక్యూరిటీ, కెరీర్ బాగా ఎదుగుతుంది అని పేరుంది. కానీ ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తది, ఏదన్నా పని తొందరగా అవ్వాలంటే చాలా ప్రాసెస్ ఉంటది. పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు.. ఇవన్నీ కొత్తగా ఆలోచించేవాళ్లకు నచ్చకపోవచ్చు. అందుకేమో ఈ కంపెనీలు మంచి లిస్టులోనూ లేవు, చెడ్డ లిస్టులోనూ లేవు. ఈ రెండు కంపెనీల్లో ట్రైనింగ్ ఇస్తారు. స్కిల్స్ పెంచుకోవడానికి హెల్ప్ చేస్తారు. కానీ క్లయింట్లతో డైరెక్ట్‌గా పనిచేసేవాళ్లకు మాత్రం బాగా ఒత్తిడి ఉంటది.

అలాగే హెచ్‌సీఎల్, విప్రో కూడా టెక్నాలజీలో బాగానే ముందుకెళ్తున్నాయి కానీ పాతకాలం నాటి మేనేజ్‌మెంట్ స్టైల్ ఇంకా వదలట్లేదు. హెచ్‌సీఎల్‌లో అయితే ఆఫీస్ కల్చర్ పెద్దగా మారదు అని అంటారు. విప్రోలో మేనేజ్‌మెంట్ సరిగ్గా ఉండదని కొంత మంది అంటారు. ఈ కంపెనీల్లో జీతాలు మాత్రం బాగానే ఇస్తారు. కెరీర్లో ఎదిగేందుకు అవకాశాలు కూడా బాగుంటాయ్. కానీ పనిచేసేవాళ్లు అంత హ్యాపీగా లేరు అనిపిస్తుంది. అందుకేమో ఈ కంపెనీలు ర్యాంకింగ్స్‌లో కనిపించలేదు.

ఈ కంపెనీల్లో చాలామంది పనిచేస్తారు కదా. బహుశా చాలామందికి యావరేజ్‌గా అనిపిస్తుందేమో. అదే అమెజాన్, అట్లాసియన్, ఐబీఎం లాంటి కంపెనీల్లో పనిచేసేవాళ్లకి అయితే బాగా మంచిగానో లేకపోతే బాగా బాగాలేదనో అనిపిస్తది కాబట్టి వాళ్లు ర్యాంకింగ్స్‌లో ముందున్నారు.

ఇంకా ముందుకెళ్లాలంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో వాళ్ల ఆఫీస్ కల్చర్‌ని, మేనేజ్‌మెంట్ స్టైల్‌ని మార్చుకోవాలి. టెక్ ఇండస్ట్రీలో పోటీ బాగా పెరిగిపోతుంది. పనిచేసేవాళ్లకి మంచి లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి. ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆఫీసులు ఉండాలి. అప్పుడే మంచి టాలెంట్‌ని పట్టుకోగలుగుతారు. లేకపోతే లాంగ్ టర్మ్‌లో కష్టం అవుతుంది.