Begin typing your search above and press return to search.

2024 నామ సంవత్సరం : ఎవరికి స్వీట్...ఎవరికి హాట్...!?

ఏపీలో చూస్తే వైసీపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ రెండవసారి సీఎం గా ప్రమాణం చేయాలని పట్టుదల మీద ఉన్నారు. ఇక చంద్రబాబు ముమ్మారు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

By:  Tupaki Desk   |   1 Jan 2024 12:48 PM GMT
2024 నామ సంవత్సరం  :  ఎవరికి స్వీట్...ఎవరికి హాట్...!?
X

ఒక్కో ఏడాదికి ఒక్కో విశిష్టత ఉంటుంది. అలా చూసుకుంటే ఎన్నికల వేళ ఎంట్రీ ఇచ్చే సంవత్సరాలు చరిత్రలో నిలిచిపోతాయి. అవి రాజకీయాలను విశ్లేషించేటపుడు తరచుగా ప్రస్తావనకు వస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే 2024 కూడా చాలా ఆశలను మోసుకొచ్చింది. ఇంకా మొదటి రోజు మాత్రమే గడచింది. పైగా 2024 లీఫ్ సంవత్సరం ఇంకా 365 రోజులు నిండా బిగిసి ఉన్నాయి. 2024 ప్రత్యేకత ఏంటి అంటే లోక్ సభ ఎన్నికలు జరిపించే ఇయర్ ఇదే. అంతే కాదు దేశంలో చాలా రాష్ట్రాల జాతకాలు కూడా 2024 తేల్చేస్తుంది.

అందులో ఏపీ ఒడిషా మహారాష్ట్ర వంటి కీలకమైన రాష్ట్రాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఏపీకి సంబంధించి ఎన్నికలకు ఒక అంచనా ప్రకారం చూస్తే ఇప్పటికి మరో ఎనభై రోజుల వ్యవధిలోనే ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఈసారి ఎవరు గెలుస్తారు. ఎవరిని 2024 గెలిపించబోతోంది అన్నదే చర్చగా ఉంది

ఏపీలో చూస్తే వైసీపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ రెండవసారి సీఎం గా ప్రమాణం చేయాలని పట్టుదల మీద ఉన్నారు. ఇక చంద్రబాబు ముమ్మారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన మరోసారి సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు. దానికి తగినట్లుగా తెలుగుదేశం తన పని తాను చేసుకుంటోంది అని అంటున్నారు.

మరి న్యూ ఇయర్ గ 2024 మొదలైంది. అంతే సోషల్ మీడియాలో ఒక్కటే హోరు కనిపిస్తోంది. అటు వైసీపీ క్యాడర్ ఇటు టీడీపీ క్యాడర్ ఎవరికి తోచిన విధంగా వారు పోస్టింగులు పెడుతున్నారు. 2024 వచ్చిందే జగన్ ని సీఎం చేయడానికే ఇది జగన్ నామ సంవత్సరం అని వైసీపీ వారు హోరెత్తిస్తూంటే లేదు ఈ ఏడాదిలో మరో మూడు నెలలు మాత్రమే జగన్ సీఎం గా ఉంటారు.

ఆ తరువాత వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని ఆ పార్టీ క్యాడర్ పోస్టులు పెడుతోంది. మరి రెండు పార్టీల ఆశలు ఒక లెవెల్ లో ఉన్నాయి. ఎవరిని సీఎం గా 2024 చేస్తుంది అన్నది చూడాలని అంటున్నారు. ఇక 2004లో వైఎస్సార్ అధికారంలోకి వచ్చి 2009లో రెండవసారి కూడా గెలిచారు అని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వైఎస్సార్ ఫ్యామిలీకి ఓటమి అనేది లేదని పైగా వరస విజయాలు ఆ ఫ్యామిలీకి పాజిటివ్ సెంటిమెంట్ గా ఉందని గుర్తు చేస్తున్నారు.

అలా చూస్తే కనుక జగన్ కి రెండవ విజయం కచ్చితం అని చెబుతున్నారు. అదే విధంగా చంద్రబాబు సక్సెస్ ట్రాక్ ని కూడా ముందు పెడుతున్నారు. 1995లో నందమూరి తారక రామారావు ప్రభుత్వం గెలుచుకున్న అధికారాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు 1999లో మాత్రం పోటీ చేశారని, అపుడు తక్కువ సీట్లతో గెలిచారు అని గుర్తు చేస్తున్నారు. ఆ తరువాత రెండవసారి 2004లో చంద్రబాబు గెలవలేదని కూడా ఫ్లాష్ బ్యాక్ ని వైసీపీ నేతలు చెబుతున్నారు.

అంతే కాదు, పదేళ్ల సుదీర్ఘ విరామం తరువాత 2014లో విభజన ఏపీకి సీఎం అయిన చంద్రబాబు అదే విజయాన్ని 2019లో రెండోసారి కొనసాగించలేకపోయారు అని కూడా గుర్తు చేస్తున్నారు. జగన్ వైఎస్సార్ వారసుడిగా వరస విజయాలు నమోదు చేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక టీడీపీ అయితే జగన్ కి ఒక్క చాన్స్ ని మాత్రమే ప్రజలు ఇచ్చారు రెండవ చాన్స్ లేనే లేదని అంటోంది, సో అలా కనుక చూస్తే జగన్ తన అధికారాన్ని టీడీపీకి అప్పగించాల్సిందే అని అంటోంది. ఇక దేశ రాజకీయాల్లో చూస్తే వరసగా రెండు సార్లు గెలిచిన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దించాలని విపక్ష కూటమి చూస్తోంది.

ఈసారి కూడా కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్ష కూటమి అధికారంలోకి రాకపోతే ఇబ్బందే అని అంటున్నారు. దాంతో మోడీ ప్రభుత్వానికి 2024 చేదు వార్తను మోసుకొచ్చిన ఇయర్ అని అంటున్నారు. కానీ మోడీ సర్కార్ హ్యాట్రిక్ విజయానికి బాటలు వేసే ఇయర్ 2024 అని బీజేపీ నేతలు పోస్టులు పెడుతున్నారు. చూడాలి మరి ఎవరి ఆశలు 2024 నెరవెరుస్తుందో.