Begin typing your search above and press return to search.

పాక్ ను ట్రోల్ చేస్తున్న భారత సైన్యం... ఈ పిక్ వేరే లెవెల్ అంతే..!

అవును... ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, కజకిస్థాన్ భూ బలగాల అధిపతి మేజర్ జనరల్ మెరెకే కుచెక్‌ బయేవ్‌ ను కలిశారు.

By:  Raja Ch   |   16 Oct 2025 3:27 PM IST
పాక్  ను ట్రోల్  చేస్తున్న భారత సైన్యం... ఈ పిక్  వేరే లెవెల్  అంతే..!
X

సమయం సందర్భం లేకుండా, భారత్ ప్రమేయం లేకపోయినా.. మన దేశంపై పాకిస్థాన్ నిత్యం నిప్పులు కక్కుతూనే ఉంటుంది.. నిస్సిగ్గుగా ఎద్దేవా చేస్తూనే ఉంటుంది. ఆఖరికి తాజాగా ఆఫ్గాన్ చేతుల్లో చితక్కొట్టించుకున్నా.. అది భారత్ పరోక్షంగా చేస్తున్న పనే అనే స్థాయికి దిగజారిపోతుంటుంది. ఈ క్రమంలో తాజాగా 1971 నాటి సంగతులు, వారి స్థాయిని గుర్తు చేస్తూ భారత్ సైన్యం ఓ పిక్ ను పోస్ట్ చేసింది.. ఇది వైరల్ గా మారింది.

అవును... ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, కజకిస్థాన్ భూ బలగాల అధిపతి మేజర్ జనరల్ మెరెకే కుచెక్‌ బయేవ్‌ ను కలిశారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య శాశ్వత రక్షణ భాగస్వామ్యంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో... శిక్షణ సహకారం, సామర్థ్య నిర్మాణం, ప్రాంతీయ శాంతి, స్థిరత్వంపై చర్చించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ సమావేశానికి సంబంధించిన ఆర్మీ పంచుకున్న చిత్రాలు ఆసక్తిగా మారాయి.

ఈ చిత్రాల్లో.. 1971లో పాకిస్థాన్.. భారతదేశానికి లొంగిపోయినప్పటి ఐకానిక్ చిత్రం కనిపించింది. ఇందులో భాగంగా... అప్పటి పాకిస్థాన్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ.. భారతదేశ లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా సమక్షంలో లొంగుబాటు ఒప్పందంపై సంతకం జరిగిన విషయాన్ని ఆ చిత్రం గుర్తు చేస్తుంది. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

కాగా... 1971 డిసెంబర్ 16న భారతదేశం ఒక సహస్రాబ్దిలో సాధించిన తొలి సమగ్ర సైనిక విజయాం చొటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సుమారు 54 సంవత్సరాల క్రితం ఆ రోజున.. పూర్వపు తూర్పు పాకిస్తాన్‌ లోని సాయుధ దళాల కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ, ఢాకాలోని రేస్ కోర్స్ మైదానంలో జరిగిన బహిరంగ కార్యక్రమంలో లొంగిపోయే పత్రంపై సంతకం చేశారు.

అనంతరం బంగ్లాదేశ్ అనే కొత్త దేశం సృష్టించబడింది. ఇదే సమయంలో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు, పారామిలిటరీ, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ అధికారులు యుద్ధ ఖైదీలుగా మారారు. ఈ అద్భుతమైన సందర్భాన్ని తూర్పు కమాండ్ అప్పటి జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ అరోరా ఒక ఐకానిక్ ఛాయాచిత్రంలో బంధించారు.. ప్రపంచవ్యాప్తంగా ఒక క్లాసిక్ వ్యూహాత్మక విజయాన్ని ఆ చిత్రం గుర్తుచేస్తుంటుంది.

మరోవైపు.. ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న పాక్, పీఓకే లోని ఉగ్రవాదులు, ఉగ్రశిబిరాలపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో సుమారు 100 మంది ఉగ్రమూకలు హతమవ్వగా, సుమారు 9 కీలక ఉగ్ర శిబిరాలు ధ్వంసం అయ్యాయి! ఈ క్రమంలో.. పాక్ విన్నపం మేరకు మే 10న సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. ఆ దేశ ప్రజానికం ఊపిరి పీల్చుకుంది.