Begin typing your search above and press return to search.

వీడెవడ్రా బాబు.. లవ్వర్ కు 15 కండీషన్లు.. చదివితే దిమ్మ తిరిగిద్ది

సరైన అమ్మాయి దొరికితే చాలనుకుంటున్న ఈ రోజుల్లో మేల్ ఈగోను ప్రదర్శించే ఈ బాయ్ ఫ్రెండ్ ఎవడ్రా బాబు

By:  Tupaki Desk   |   17 Aug 2023 4:47 AM GMT
వీడెవడ్రా బాబు.. లవ్వర్ కు 15 కండీషన్లు.. చదివితే దిమ్మ తిరిగిద్ది
X

కాలం మారింది. పరిస్థితులు మారాయి. అందుకు తగ్గట్లు మారకుండా తన గురించి.. తన ఇష్టాయిష్టాల గురించి మాత్రమే తప్పించి.. ఎదుటోళ్ల గురించి ఆలోచించని పురుష పుంగవుల గురించి అమ్మాయిలు లైట్ తీసుకోవటం మొదలై కొంతకాలమైంది. ఈ తరంలో ఇలాంటి విషయాలకు మరింత ప్రయారిటీ ఇస్తున్నారు. ఇలాంటి వేళ.. అప్పుడెప్పుడో ముప్ఫై.. నలభై ఏళ్ల క్రితం నాటి మగమహారాజు మాదిరి ఫోజ్ కొడుతూ.. తన లవ్వర్ కు ఒక ప్రియుడు పెట్టిన పదిహేను కండీషన్ల గురించి తెలిస్తే నోటి వెంట మాట రాదంతే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందంగా ఉండి.. అర్థం చేసుకునే అమ్మాయి దొరికితే చాలనుకుంటే.. చాతాండత లిస్టుతో పెట్టిన కండీషన్లు పెట్టిన తన లవ్వర్ గురించి పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.

సరైన అమ్మాయి దొరికితే చాలనుకుంటున్న ఈ రోజుల్లో మేల్ ఈగోను ప్రదర్శించే ఈ బాయ్ ఫ్రెండ్ ఎవడ్రా బాబు.. వీడో తేడా కేసు అన్నట్లుగా అతగాడి కండీషన్లు ఉండటం కనిపిస్తుంది. తన ప్రియుడి కండీషన్లను పోస్టు చేసిన అమ్మాయికి.. వీడితో కష్టం.. వద్దంటూ నెటిజన్లు సైతం రియాక్టు కావటం చూస్తే.. ఇతగాడి ఆశలు ఎంతలా ఉన్నాయన్న భావన కలుగక మానదు. ఇంతకీ ఇతగాడి పదిహేను కండీషన్లు ఏమిటి? అన్నది చూస్తే.. చదివే వాళ్లకే దిమ్మ తిరిగిపోయే షాకింగ్ గా ఉంటుంది. అలాంటిది సదరు ప్రేయసి పరిస్థితి ఊహించుకుంటే చెప్పాల్సిన అవసరం లేదు. తనకు పెట్టిన పదిహేను కండీషన్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆమె పేర్కొంది.

ఇంతకీ ఆ 15 కండీషన్లు ఏమంటే..

- ఎత్తు 5'6 కాని.. దానికంటే కొంచెం తక్కువ హైట్ కలిగి ఉండాలి.

- జుట్టు రంగు సహజంగా ఉండాలి కళ్లు నీలం రంగులో కాని ఆకుపచ్చగా ఉండాలి

- శరీరంపై టాటూ లాంటివి ఉండొద్దు.

- బయట తినడం.. తాగడం లాంటివి చేయకూడదు

- బిగుతు దుస్తులు ధరించకూడదు.. క్రాప్ టాప్ లు వేసుకోవద్దు

- ఆల్కహాల్ తీసుకోకూడదు.. స్మోక్ చేయకూడదు

- తండ్రితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి.

- ఏ విషయంలోనూ తనతో వాదించకూదు

- చదువు మీద కాని ఉద్యోగం మీదా కాని ఆసక్తి ఉండాలి.

- సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండొద్దు

- ఐదు మగ సంతానాన్ని ఇవ్వాలి

- అబ్బాయిలతో మాట్లాడకూడదు.. మగవారు ఫ్రెండ్స్ గా ఉండొద్దు.

- ఎక్కడికి వెళ్లినా రాత్రి 9 గంటల కల్లా తిరిగి రావాలి

- తానిచ్చిన ఉంగరాన్ని ఎప్పటికీ తీయకూడదు

- ఎలాంటి పార్టీలకు వెళ్లకూడదు