Begin typing your search above and press return to search.

బిల్లు వీగిపోయేలా ఓటు వేసిన పార్టీలు.. వాటి ఎంపీల లెక్క ఇదే

నిజాన్ని నిజంగా కాకుండా.. ఎమోషన్ తో నిజాన్ని తప్పుడు పద్దతిలో ప్రచారం చేయటం ఆయా ప్రజల్నిమోసం చేయటమే అవుతుంది.

By:  Garuda Media   |   18 April 2026 9:29 AM IST
బిల్లు వీగిపోయేలా ఓటు వేసిన పార్టీలు.. వాటి ఎంపీల లెక్క ఇదే
X

నిజాన్ని నిజంగా కాకుండా.. ఎమోషన్ తో నిజాన్ని తప్పుడు పద్దతిలో ప్రచారం చేయటం ఆయా ప్రజల్నిమోసం చేయటమే అవుతుంది. తాజాగా లోక్ సభలో శుక్రవారం జరిగిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన పార్టీల తీరు ఈ మాటకు దగ్గరగా ఉందని చెప్పాలి. నిజానికి మోడీ సర్కారు ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే.. దక్షిణాది రాష్ట్రాలకు లాభమే తప్పించి నష్టం జరిగే అవకాశమే లేదు. అందుకు భిన్నంగా లేని బూచిని.. ఉన్నట్లుగా చూపించటంలో విపక్షాలు సక్సెస్ అయ్యాయి.

రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా.. డీలిమిటేషన్ ప్రక్రియను చేపడితే..తొలుత నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే. ప్రస్తుతం మోడీ సర్కారు తెర మీదకు తీసుకొచ్చిన 50 శాతం సీట్ల పెంపుతోనే దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. అందుకు భిన్నంగా 2011 జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకున్నా.. 2026 జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకొని డీ లిమిటేషన్ ప్రక్రియను చేపడితే..భారీగా నష్టపోవటం ఖాయం. అయితే.. ఈ విషయంలో మోడీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించటంలో విఫలమైందని చెప్పాలి.

వాస్తవాల్ని వివరంగా చెప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. మోడీ సర్కారు ఆ పని చేయలేదు. అదే సమయంలో.. విపక్ష కాంగ్రెస్ మాత్రం లేని బూచిని ఉన్నట్లుగా చూపించి.. మొత్తంగా బిల్లు వీగిపోయేలా చేసింది. చివరకు దక్షిణాదికి మేలు చేయటం తర్వాత నష్టపోయేలా చేయటం కీలక భూమిక పోషించింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మొత్తం 230 మంది ఎంపీలు ఓటు వేశారు. బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజార్టీ (528 మంది సభ్యుల్లో 352) పొందాల్సి ఉంది.అందుకు భిన్నంగా అనుకూలంగా 298 మంది ఓటు వేస్తే.. వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు. బిల్లు ఆమోదానికి అవసరమైన 54 ఎంపీల మద్దతు లభించని కారణంగా బిల్లు వీగిపోయింది.

ఇంతకూ బిల్లు వీగిపోయేలా చేసి.. దక్షిణాది పాలిట విలన్లుగా వ్యవహరించిన పార్టీలేంటి? వాటికి ఉన్న ఎంపీల బలం ఏమిటి? అన్నది చూస్తే.. దక్షిణాదికి చెందిన పార్టీలు కూడా ఉండటం విశేషం. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన పార్టీలు.. ఎంపీ సంఖ్యను చూస్తే..

పార్టీ ఎంపీలు

కాంగ్రెస్ 99

సమాజ్ వాదీ 37

తృణమూల్ కాంగ్రెస్ 29

శివసేన (యూబీటీ) 9

ఎస్పీ 8

సీపీఐ-సీపీఎం 6

ఆర్జేడీ 4

ఆమ్.. మజ్లిస్ తదితర 16

వీరంతా కలిపితే 230 మంది ఎంపీలు అవుతారు. ఇందులో దక్షిణాదికి చెందిన డీఎంకే అతి పెద్ద పార్టీగా చెప్పాలి. అదే విధంగా దక్షిణాదిలో అధికారంలో ఉన్న తెలంగాణ.. కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఎంపీలు సైతం తమకు ప్రాంతానికి నష్టం జరిగేలా వ్యవహరించేలా ఓట్లు వేయటం గమనార్హం. హైదరాబాద్ కు చెందిన మజ్లిస్ కూడా సౌత్ కు నష్టం వాటిల్లే వాదనను నమ్మి.. మోడీ సర్కారు తీసుకొచ్చిన బిల్లును వ్యతిరేకించటం ద్వారా దక్షిణాదికి నష్టం వాటిల్లేలా చేశారని చెప్పాలి.