11ఏళ్ళ పాలనకు మోడీ మాస్టార్ వేసిన మార్కులు
ఈ సందర్భంగా ప్రధాని హోదాలో మోడీ వేసిన ట్వీట్ ఇపుడు వైరల్ గా మారింది. 11 ఏళ్ళ బీజేపీ పాలనకు మోడీ మాస్టార్ నూరు మార్కులూ వేశారు.
By: Tupaki Desk | 9 Jun 2025 11:14 PM ISTకేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం జూన్ 9వ తేదీతో 11 ఏళ్ళ పాటు కొనసాగినట్లు అయింది. ఇంకా చేతిలో మరో నాలుగేళ్ళ అధికారం ఉంది. ఇక బీజేపీ లాంటి పార్టీకి ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాల్సిందే. బీజేపీ 1996 మే 15న అధికారంలోకి వచ్చి కేవలం 13 రోజులు మాత్రమే పాలన చేసింది. అలా 13 రోజున నుంచి 11 ఏళ్ళ దాకా ఎదగడం అంటే కమలం పార్టీ సాధించిన అతి పెద్ద విజయంగా చూడాలి.
అంతే కాదు హ్యాట్రిక్ విజయాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. వరుసగా మూడు సార్లు బీజేపీ కేంద్రంలో పవర్ లోకి వస్తే మోడీ మూడు సార్లూ ప్రధానిగా ఉన్నారు. ఇక 2024లో మూడోసారి గెలిచిన తరువాత జూన్ 9న మోడీ ప్రభుత్వం ప్రమాణం చేసింది. దాంతో ఈ రోజు బీజేపీకి వెరీ స్పెషల్
ఈ సందర్భంగా ప్రధాని హోదాలో మోడీ వేసిన ట్వీట్ ఇపుడు వైరల్ గా మారింది. 11 ఏళ్ళ బీజేపీ పాలనకు మోడీ మాస్టార్ నూరు మార్కులూ వేశారు. పైగా గర్వించే పాలన అన్నారు. ఈ 11 ఏళ్ళలో దేశంలో విప్లవాత్మకమైన మార్పులు ఎన్నో వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు.
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అన్నది బీజేపీ విధానమైంది అన్నారు. అంతే కాదు బీజేపీ పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని గుర్తు చేశారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా పనిచేస్తోంది అని కూడా చెప్పారు. బీజేపీది సుపరిపాలన అభివృద్ధి మంత్రం అని ఆయన అభివర్ణించారు.
సామాజిక అభ్యున్నతి వైపుగా పాలనను తీసుకెళ్ళామని ఆయన గుర్తు చేసుకున్నారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ తీసుకుని వచ్చిన ఉజ్వల అలాగే, ప్రధానమంత్రి ఆవాస్, ఆయుష్మాన్ భారత్ అలాగే భారతీయ జనౌషధి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇలా ఏ పధకం అయినా పేదల కోసమే రూపొందించామని ఆయన స్పష్టం చేశారు.
ఈ పధకాలు అన్నీ జన జీవితాలలో సమూలమైన మర్పులు తీసుకుని వచ్చాయని అన్నారు. అంతే కాదు సగటు ప్రజానీకం జీవన ప్రయాణాన్ని సులభతరం చేసాయని అన్నారు. జీవితంలో అన్నీ అందుబాటులోకి రావడం ద్వారా జీవన సౌలభ్యాన్ని పెంచాయని చెప్పారు.
ఇక దేశంలో వచ్చిన మార్పులు అనేకం అని మోడీ చెప్పారు. అందులో నమో యాప్ అన్నది ఒకటి అన్నారు. అంతే కాదు ఈ యాప్ ద్వారా ఇంటరాక్టివ్ గేమ్‌లు, క్విజ్‌లు, సర్వేలు, సమాచారం ఇలా ఎన్నో అందించడం జరిగిందని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఎంచుకున్న మార్గం సక్రమమే అని ఈ 11 ఏళ్ళ పాలన రుజువు చేసిందని అన్నారు. ఒకటి సుపరిపాలన మరొకటి జన జీవితంలో పరివర్తన ఇలా ఈ రెండు లక్ష్యాలను చేరుకున్నామని మోడీ పేర్కొన్నారు.
ఇదంతా కేవలం ఎన్డీయే సర్కార్ కి సాధ్యమైంది అంటే కనుక కానే కాదని దాని వెనక 140 కోట్ల మంది ప్రజానీకం ఆశీస్సులు నిండుగా మెండుగా ఉన్నాయని మోడీ చెప్పారు. అలాగే భారతీయుల ప్రోత్సాహం ఉత్సాహం ఉందని అన్నారు. అందుకే భారతదేశం విభిన్నమైన రంగాలలో అనేక సమూలమైన మార్పులను ఈ దశాబ్దానికి పైగా సాగిన కాలంలో చూసిందని ఆయన విశ్లేషించారు.
ఇదిలా ఉంటే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పదకొండేళ్ళు పూర్తయిన సందర్భంగా వికసిత్ భారత్‌కా అమృత్ కాల్ అన్న పేరుతో ఒక భారీ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇక మోడీ సైతం తన ప్రభుత్వంలో మంచిని చెబుతూ సానుకూల ద్కృపధమే తమ ప్రభుత్వాన్ని ఇన్నేళ్ళూ ఒక స్పూర్తిగా నిలిచి నడిపించింది అని అన్నారు.
ఇది కచ్చితంగా బీజేపీ విజయం. అంతే కాదు మోడీ విజయం. అలాగే భాగస్వాములైన ఎన్డీయే మిత్రుల విజయం కూడా. మరో నాలుగేళ్ళ పాలనతో మోడీ 15 ఏళ్ళ పాటు నిరాటంకంగా పాలించిన ప్రధానిగా నెహ్రూ తరువాత స్థానంలోకి రాబోతున్నారు. ఇలా అనేక రికార్డులను ఆయన తొందరలోనే బద్ధలు కొట్టబోతున్నారు అని కమలనాధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.