Begin typing your search above and press return to search.

రిజైన్ చేస్తున్న ఉద్యోగికి.. 3రెట్లు జీతం ఆఫర్ చేసిన గూగుల్

దిగ్గజ గూగుల్. తమ దగ్గరి ఉద్యోగి ఒకరు తన జాబ్ కు రిజైన్ చేస్తానంటే 300 శాతం జీతాన్ని పెంచి మరీ జాబ్ లో కంటిన్యూ కావాలని కోరిన వైనం ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   21 Feb 2024 8:30 AM GMT
రిజైన్ చేస్తున్న ఉద్యోగికి.. 3రెట్లు జీతం ఆఫర్ చేసిన గూగుల్
X

ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం మేఘాలు దట్టంగా ముసురుకుంటున్న వేళ.. ఎవరి ఉద్యోగం ఉంటుందో.. మరెవరిది ఊడుతుందో తెలీని పరిస్థితి. ఆ కంపెనీ ఈ కంపెనీ అన్న తేడా లేకుండా దిగ్గజ కంపెనీలు సైతం తమ కత్తికి పదును పెడుతూ ఉద్యోగుల్ని తీసేస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో టెక్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల్లో టెన్షన్ అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటివేళ..గతంలో మాదిరి ఉద్యోగులు కంపెనీ మారేందుకు పెద్దగా ఇష్టపడటం లేదు.

ఇలాంటివేళలో ఒక ఉద్యోగి రాజీనామా చేస్తూ.. తన రిజైన్ లెటర్ ను పంపితే.. అతన్ని జాబ్ లోకొనసాగాలని కోరటమే కాదు.. అందుకు ప్రతిఫలంగా 3 రెట్ల ఎక్కువ జీతాన్ని ఆఫర్ చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ ఇంత భారీ జీతాన్నిఆఫర్ చేసిన కంపెనీ మరేదో కాదు.. దిగ్గజ గూగుల్. తమ దగ్గరి ఉద్యోగి ఒకరు తన జాబ్ కు రిజైన్ చేస్తానంటే 300 శాతం జీతాన్ని పెంచి మరీ జాబ్ లో కంటిన్యూ కావాలని కోరిన వైనం ఆసక్తికరంగా మారింది.

ఇప్పుడీ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ ఆ ఉద్యోగి ఎవరు? ఏ విభాగంలో పని చేస్తుంటాడు? అన్న విషయాల్లోకి వెళితే.. యూఎస్ కు చెందిన సదరు ఉద్యోగి గూగుల్ లోని ఏఐ సాంకేతిక నిపుణుడిగా పని చేస్తున్నాడు. అతను 'పెర్ ప్లెక్సిటీ ఏఐ' అనే సంస్థకు మారాలని నిర్ణయించుకున్నాడు. తన రిజైన్ లెటర్ ను కంపెనీ హెచ్ ఆర్ కు పంపాడు. అంతే.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంస్థ.. అతన్ని రిజైన్ చేయొద్దని.. సంస్థలోనే కొనసాగాలని కోరింది. కారణం అతను గూగుల్ సెర్చ్ టీంలోని ఏఐ సాంకేతికతలో పని చేసే ఉద్యోగి.

తాజాగా అందుబాటులోకి వచ్చిన సాంకేతికత నేపథ్యంలో భారీ లేఆఫ్స్ ను ప్రకటించారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. 2023లో ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ ఉద్యోగుల్లో 12వేల మందిని తొలగించారు. 2024 జనవరి 10 నుంచి గూగుల్ లోని వివిధ విభాగాలకు చెందిన వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించారు. ఇలాంటివేళ.. ఒక ఉద్యోగి రిజైన్ చేస్తానన్నంతనే అతనికి 300 శాతం జీతాన్ని పెంచేసి మరీ తమ వద్ద ఉండాలని కోరటం ఆసక్తికరంగా మారింది.

ఈ విషయాన్ని 'పెర్ ప్లెక్సిటీ ఏఐ' సంస్థ సీఈవో అరవింద్ శ్రీనివాస్ పాడ్ కాస్ట్ లో స్వయంగా తెలియజేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో అర్థమయ్యే విషయం ఒక్కటే.. వ్రత్తి నైపుణ్యాల్లో ఉద్యోగి కీలకంగా ఉంటే ఎన్ని లేఆఫ్ లు ఉన్నా.. మరెంత మాంద్యం ఉన్నా సంస్థ ఏదైనా సదరు ఉద్యోగిని వదులుకోవటానికి అస్సలు ఇష్టపడదని.