Begin typing your search above and press return to search.

50 లేదా 70 గంటలు ముఖ్యం కాదు... ఇన్ఫీ మూర్తికి గోయెంకా కౌంటర్?

ఈ మేరకు సోమవారం ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

By:  Tupaki Desk   |   31 Oct 2023 2:45 AM GMT
50 లేదా 70 గంటలు ముఖ్యం కాదు... ఇన్ఫీ మూర్తికి గోయెంకా కౌంటర్?
X

యువ ఉద్యోగులు, పనిగంటలపై ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది నెటిజన్లు ఈ స్టెట్ మెంట్స్ పై ఫైర్ అవుతుండగా.. మరికొంతమంది ఐటీ దిగ్గజాలు నారాయణ మూర్తి మాటలకు మద్దతుగా నిలిచాయి. అటు మహిళల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉండటం గమనార్హం. ఈ క్రమంలో హర్హ్‌ గోయెంకా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి చెప్పినట్టుగా భావిస్తున్న వారానికి 70 గంటల పనివిధానం వ్యాఖ్యలపై ఇంకా ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్న క్రమంలో తాజాగా వ్యాపారవేత్త హర్హ్‌ గోయెంకా స్పందించారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

"వారానికి 5 రోజుల ఆఫీస్‌ పని విధానానికి కాలం చెల్లింది. ఆఫీసు పనిలో దాదాపు 33 శాతం రిమోట్‌ గా పని చేస్తున్నారు. ఇదోక గేం ఛేంజర్. ప్రస్తుతం 8 శాతం ప్రొడక్టవిటీని పెంచే ఫ్లెక్సిబిలిటీ ముఖ్యం. అదేవిధంగా... ఆఫీసులకు రోజువారి రాకపోకల్ని నివారించడం, ఫ్లెక్సిబిలీటీ అనే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. భవిష్యత్తు అంతా హైబ్రిడ్‌ పని విధానమే" అని హోయెంకా స్పందించారు.

ఇదే సమయంలో... "కంపెనీ అవసరాలకు అనుగుణంగా ఆఫీసు నుంచా.. లేక, రిమోట్‌ గానా అనే దానికి మిళితం చేసుకోవాలి. అంతే తప్ప 50-70 గంటలా అనేది కాదు చర్చ. దీనికి బదులుగా మన లక్ష్యం, ఉత్పదకత గురించి ఆలోచించాలి. మార్పును స్వాగతించాల్సిందే. వర్క్‌ లైఫ్‌ లో వర్క్‌ ఫ్రం హోం, లేదా ఆఫీసా అనే దాంట్లో నిజంగా ముఖ్యమైన దాన్ని గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఇది" అంటూ స్పందించారు హోయెంకా!

ఈయన రియాక్షన్ అలా ఉంటే... నారాయణ మూర్తి మాటలకు మద్దతుగా టెక్ మహీంద్రా సీఈవో పీ గుర్నానీ కీలక వ్యాఖ్యలు చేశారు. మూర్తి తన మాటల్లో... యువత ఆయా కంపెనీల కోసం 70 గంటలు పనిచేయడం గురించి అన లేదని, వ్యక్తులుగా తమ కోసం లేదా తమ దేశ అభివృద్ధి కోసం 70 గంటలు పనిచేయాలని సూచించారని అన్నారు. ఇదే సమయంలో... యువత తాము ఎంచుకున్న రంగంలో మాస్టర్‌ గా మారాలంటే కనీసం 10 వేల గంటలను పెట్టుబడిగా పెట్టాలని కూడా గుర్నాని ఈ సందర్హంగా పిలుపు నిచ్చారు.

కాగా... వారానికి 70 గంటల పనిపై ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎడిల్‌వీస్ సీఎండీ రాధికా గుప్తా స్పందించారు. ఇందులో భాగంగా... భారతీయ మహిళలు దశాబ్దాల తరపడి 70 గంటలకు మించి పనిచేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదంటూ విచారం వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి చిరునవ్వుతో ఓవర్‌ టైంని డిమాండ్‌ చేయకుండానే అదనపుభారాన్ని మోస్తూనే ఉన్నారని అన్నారు.

ఇలా ఇంటి పని, ఆఫీసు పనిని బ్యాలెన్స్‌ చేసుకోవడంతోపాటు, తరువాతి తరం పిల్లల భవిష్యత్‌ ను సక్రమంగా తీర్చిదిద్దుతూ.. చాలామంది భారతీయ మహిళలు 70 గంటల కంటే ఎక్కువే శక్తికి మించి పని చేస్తున్నారని రాధికా గుప్తా గుర్తు చేశారు. కానీ విచిత్రంగా దాన్ని ఎవరూ గుర్తించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో తాజాగా హర్హ్‌ గోయెంకా స్పందించారు.