Begin typing your search above and press return to search.

ఇంపార్టెంట్ అలర్ట్... ఎల్.ఐ.సీ ధన వృద్ధి గడువు తేదీ ఇదే!

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌.ఐ.సీ.. సింగిల్‌ ప్రీమియం బీమా ప్లాన్‌ "ధన వృద్ధి"ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   26 Sep 2023 5:07 AM GMT
ఇంపార్టెంట్ అలర్ట్... ఎల్.ఐ.సీ ధన వృద్ధి గడువు తేదీ ఇదే!
X

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌.ఐ.సీ.. సింగిల్‌ ప్రీమియం బీమా ప్లాన్‌ "ధన వృద్ధి"ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పొదుపు, బీమా కలగలిపిన కాంబినేషన్‌ లో వచ్చిన ఈ పాలసీ జూన్‌ లో వచ్చింది. ఈ క్రమంలో... ఈ పరిమితకాలపు ప్లాన్‌ గడువు సెప్టెంబర్‌ 30తో ముగుస్తోందని ఎల్.ఐ.సీ. ట్విట్టర్ లో వెల్లడించింది.

అవును... ఎల్‌ఐసీ తీసుకొచ్చిన నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌, ఇండివిడ్యువల్‌, సేవింగ్స్‌ తో కూడిన సింగిల్‌ ప్రీమియంతో వస్తున్న లైఫ్‌ ప్లాన్‌ "ధన వృద్ధి" గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ ప్లాన్ లో ఇటు ఇన్సూరెన్స్ తో పాటు రాబడి హామీ ఉంటుంది. ఈ పాలసీ కాలవ్యవధిలో పాలసీదారు మరణిస్తే నామినీకి ఆర్థిక సాయం అందించడంతో పాటు మెచ్యూరిటీ సమయంలో గ్యారెంటీ మొత్తం లభిస్తుంది.

ఇందులో రెండు ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో ఒకటి పాలసీదారు మరణిస్తే 1.25 రెట్లు చెల్లిస్తారు. రెండో ఆప్షన్‌ లో 10 రెట్లు చెల్లిస్తారు. ఈ ప్లా న్‌ 10, 15, 18 సంవత్సరాల కాలవ్యవధితో వస్తోంది. టర్మ్‌ తో పాటు ఎంచుకునే ఆప్షన్‌ ఆధారంగా వయసు 32 ఏళ్ల నుంచి 60 ఏళ్లుగా నిర్ధారించారు. ఇందులో భాగంగా... ఆప్షన్‌-1లో గరిష్ట వయసు 60 ఏళ్లు కాగా, ఆప్షన్‌-2లో గరిష్ట వయసు 40 ఏళ్లు!

ఈ పాలసీకి సంబంధించి కనీస హామీ మొత్తాన్ని రూ.1.25 లక్షలుగా ఎల్‌.ఐ.సీ నిర్ణయించింది. ఈ ప్లాన్‌ పై రుణ సదుపాయం కూడా లభిస్తుంది. పాలసీ తీసుకున్న మూడు నెలల తర్వాత ఎప్పుడైనా రుణం తీసుకోవచ్చు. ఆదాయం పన్ను చట్టంలోని 80 సీ సెక్షన్ కింద ఐటీ మినహాయింపులు పొందొచ్చు. ఈ పాలసీకి సంబంధించిన మరిన్ని వివరాలతోపాటు ఈ స్కీం ను ఆన్‌ లైన్‌ లో కొనుగోలు చేసేందుకు అధికారిక వెబ్‌ సైట్‌ ను సందర్శించవచ్చు!