Begin typing your search above and press return to search.

నిద్రకు ముందు ఉత్సాహాన్నిచ్చే ఆలోచనలు.. అసలేంటి కాగ్నిటివ్ రిఫోకసింగ్..

నిద్రకు ముందు మనసుకు ఉత్సాహం ఇచ్చే ఆలోచనలు చేయడమే కాగ్నిటివ్ రిఫోకసింగ్ అని అంటారు.

By:  Tupaki Desk   |   15 March 2024 12:30 PM GMT
నిద్రకు ముందు ఉత్సాహాన్నిచ్చే ఆలోచనలు.. అసలేంటి కాగ్నిటివ్ రిఫోకసింగ్..
X

మనం ఏ పని చేయాలన్నా శక్తి కావాలి. దానికి ఉత్సాహం కావాలి. ఉత్సాహం ఉంటేనే పనులు చేయగలం. లేకపోతే చేతకాు. ఈనేపథ్యంలో మన మానసిక స్థితి కూడా సరిగా ఉండాలి. లేకపోతే పనులు చేయడం సాధ్యం కాదు. ఒంట్లో తగినంత శక్తి లేకపోతే ముందుకు వెళ్లలేం. మన మానసిక స్థితి బాగుండాలంటే సరైన నిద్ర కావాలి. నిద్రకు ముందు మనసుకు ఉత్సాహం ఇచ్చే ఆలోచనలు చేయడమే కాగ్నిటివ్ రిఫోకసింగ్ అని అంటారు.

మన ఆలోచనలు సరైన దిశలో ఉండేలా చేస్తుంది కాగ్నిటివ్ రిఫోకసింగ్. మనం కారు డ్రైవింగ్ నేర్చుకున్నట్లయితే తరువాత రోజు సక్సెస్ ఫుల్ గా కారు నడుపుతున్నట్లు ఊహించుకుంటే మంచి ఫలితాలు రావడం సహజం. ఇలా పని చేస్తే నిద్రలేమి సమస్య నుంచి దూరం కావచ్చు. నిద్రలేమి లక్షణాలతో బాధ పడే వారికి చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశముంది.

మనం మంచి నిద్ర పోవాలంటే మంచి ఆలోచనలు చేయాలి. మనసుకు హాయినిచ్చే వాటిని ఊహించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో మనకు గాఢమైన నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. మంచి నిద్ర పడితేనే మన ఆరోగ్యం బాగుంటుంది. తరువాత రోజు మన ఆలోచనలు కూడా మంచి దారిలో వెళతాయి. అంతేకాని మనకు నిద్ర సరిగా లేకపోతే ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయమే.

నిద్రకు ఉపక్రమించే ముందు మనకు ఉత్సాహం వచ్చే విధంగా ఆలోచనలు రావాలి. దాని కోసం మనం సిద్ధంగా ఉండాలి. మంచి నిద్ర కోసం పరితపించాలి. దాని కోసం శ్రమించాల్సిన అవసరం ఉండదు. ప్రశాంతంగా ఆలోచిస్తే ఫలితాలు బాగుంటాయి. కాగ్నిటివ్ రిపోకసింగ్ అంటే ఇదే. ఇలా మన నిద్ర మనకు ఉపయోగపడాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.