Begin typing your search above and press return to search.

టాబ్లెట్లు వేసుకునేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

ఈ రోజుల్లో రోగాలు విపరీతంగా వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్నతనంలోనే వ్యాధులు చుట్టుముడుతున్నాయి

By:  Tupaki Desk   |   9 Dec 2023 1:30 AM GMT
టాబ్లెట్లు వేసుకునేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?
X

ఈ రోజుల్లో రోగాలు విపరీతంగా వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్నతనంలోనే వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, పక్షవాతం వంటి జబ్బులు క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా అందరు మందులు వాడాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో రోగాల నివారణకు టాబ్లెట్లు వాడటం తప్పనిసరి అవుతోంది. అందుకే టాబ్లెట్లు ఎలా వేసుకోవాలి? ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అవగాహన పెంచుకోవడం అవసరమే.

టాబ్లెట్లు వేసుకునే సమయంలో కొందరు నీళ్లు తాగుతారు. మరికొందరు నీళ్లు తాగరు. టాబ్లెట్లు వేసుకుంటేనే వ్యాధి నియంత్రణలో ఉంటుంది. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. అందుకే అన్ని వ్యాధులకు మందులు వేసుకుంటుంటారు. కానీ అవి వేసుకునే సందర్భంలో ఎంత మేర నీళ్లు తాగాలనేది చాలా మందిని తొలిచే సమస్య. దీనిపై అనుమానాలు పటాపంచలు చేసుకోకపోతే మనకు నష్టమే కలుగుతుంది.

మాత్ర వేసుకునేటప్పుడు ఒక గ్లాసు నీళ్లు తాగితే సరిపోతుంది. అది కూడా గోరువెచ్చని నీరు అయితే మంచిది. చల్లటి నీరు మాత్ర త్వరగా కరగకుండా చేస్తుంది. అందుకే గోరు వెచ్చని నీరు తాగడానికే ఇష్టపడాలి. మన ఆరోగ్య సమస్యను బట్టి నీరు తీసుకోవాలి. నీరు బాగా వేడిగా కూడా ఉండొద్దు. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది.

టాబ్లెట్లు వేసుకున్న తరువాత వెంటనే పడుకోవద్దు. ఓ అరగంట అయినా ఆగాలి. లేకపోతే మనకు అందే ప్రయోజనాలు అందవు. కొంతమంది పాలు, జ్యూస్ వంటి పానీయాలు తాగుతూ టాబ్లెట్లు వేసుకుంటారు. ఇది కూడా సరైంది కాదు. భోజనానికి ముందు, తిన్న తరువాత అరగంట అయినా ఆగాలి. టాబ్లెట్లు వేసుకోవడంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు ఇబ్బందులొస్తాయి.

ఇలా టాబ్లెట్లు వేసుకునే సమయంలో ఏం తినాలి? ఏం తినకూడదు? ఎంత నీరు తాగాలనే విషయాలపై స్పష్టమైన అవగాహన ఉంచుకోవాలి. టాబ్లెట్లు వేసుకునేటప్పుడు ఎంత సమయం ఉండాలి? టాబ్లెట్లు సమయం ప్రకారమే వేసుకోవాలి. ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి. టాబ్లెట్లు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకోవాలి.

ఆరోగ్య రీత్యా టాబ్లెట్లు అందరికి అవసరమే. కాకపోతే వాటి వాడకంలో మనం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిందే. మాత్రలే కదా అని ఏమరుపాటుగా ఉండొద్దు. టాబ్లెట్ల గురించి స్పష్టమైన అవగాహనతో ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దీనికి అందరు కట్టుబడి ఉండి మన హెల్త్ ను చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.