Begin typing your search above and press return to search.

100 కోట్ల మందికి కీళ్లవ్యాధి... ఫ్యూచర్ చెబుతున్న లాన్సెట్‌!

అయితే ముందు ముందు ఈ పరిస్థితి మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని.. వీరిలో మరి ముఖ్యంగా స్త్రీలు అధికశాతం ఉండోచ్చని చెబుతూ.. అందుకు గల కారణాలు వెల్లడిస్తున్నారు శాత్రవేత్తలు.

By:  Tupaki Desk   |   23 Aug 2023 6:41 AM GMT
100 కోట్ల మందికి కీళ్లవ్యాధి... ఫ్యూచర్  చెబుతున్న లాన్సెట్‌!
X

అస్సలు నడవలేకపోతున్నానండీ... లేచినా కూర్చున్నా కీళ్ల నొప్పులు... ఉదయం నిద్ర లేచి మంచంపై నుంచి దిగి కాళ్లు నేలపై పెట్టాలంటే దేవుడు కనిపిస్తున్నాడు.. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి వచ్చేసిందండి.. సాధారణంగా కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు చెప్పే మాటలివి! వారి సమస్య తీవ్రత ఆ స్థాయిలో ఉంటుంది!

అయితే ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 30ఏళ్లు, అంతకు మించిన వారు సుమారు 15% మంది ఈ వ్యాదితో బాదపడుతున్న పరిస్థితి! అయితే ముందు ముందు ఈ పరిస్థితి మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని.. వీరిలో మరి ముఖ్యంగా స్త్రీలు అధికశాతం ఉండోచ్చని చెబుతూ.. అందుకు గల కారణాలు వెల్లడిస్తున్నారు శాత్రవేత్తలు.

ఈ క్రమంలో తాజాగా "లాన్సెట్‌ రుమటాలజీ జర్నల్‌"లో ప్రచురితమైన రీసర్చ్ కథనం ప్రకారం... ప్రపంచంలో 2050 నాటికి రమారమి వంద కోట్ల మంది ప్రజలు కీళ్లవ్యాధితో జీవించాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని తెలుస్తోంది. 1990-2020 మధ్య కాలానికి సంబంధించి 200 దేశాల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన మీదట ఈ నివేదికను రూపొందించినట్లు చెబుతున్నారు.

ఈ ఘణాంకాల ప్రకారం... 1990లో 25.60 కోట్లమంది కీళ్ల నొప్పుల సమస్యలతో బాదపడితే, 2020 నాటికి అది 59.50 కోట్లకు పెరిగిందని తెలుస్తోంది. అంటే... 30 ఏళ్లలో దీని పెరుగుదల 132% అన్నమాట. ఈ లెక్కన చూసుకుంటే... 2050 నాటికి సుమారు 100 కోట్ల మంది ఈ వ్యాది బారిన పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు!

అయితే ఇందుకు గల కారణాలను నిపుణులు క్లియర్ గా చెబుతున్నారు. ముఖ్యంగా... వయోభారం, జనాభా పెరుగుదల, స్థూలకాయం అనే మూడు కారణాల వల్ల కీళ్ల సమస్యలు వేగంగా పెరిగిపోతున్నాయని నిపుణులు తేల్చారు. జనాభాలో స్థూలకాయాన్ని నియంత్రించగలిగితే ఈ సమస్యను 20% మేర తగ్గించవచ్చని ఈ సందర్భంగా వారు చెబుతున్నారు.

ఇదే సమయంలో శారీరక శ్రమ చేస్తున్నకొద్దీ జీవితంలో త్వరగా గాయాలపాలయ్యే ప్రమాదాన్ని తప్పించుకోవడంతోపాటు కీళ్ల సమస్యల నుంచీ బయటపడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోని పక్షంలో ముందు ముందు ఈ తీవ్రత మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఇదే సమయంలో ఈ వ్యాదిని ఎదుర్కొనే అవకాశం పురుషులలో 39% గా ఉండే ఛాన్స్ ఉంటే... మహిళల్లోనే ఎక్కువగా 61% ఉండే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. దీంతో... ప్రస్తుతానికి ఆస్టియో ఆర్థరైటిస్‌ నిర్మూలనకు సమర్థమైన చికిత్స అందుబాటులో లేనందున.. అది రాకుండా చూసుకోవడమే మేలని ఈ అధ్యయనం సూచించింది.