Begin typing your search above and press return to search.

రెడ్ బనానా మూడు వారాలు కంటిన్యూగా తింటే...?

భారత్ లో అత్యంత విరివిగా.. ఉన్నంతలో కాస్త చవకగా దొరికే పండ్లలో అరటి పండు కూడా ఒకటి! ఇక రెగ్యులర్ గా కనిపించే అరటిపండ్లలో చాలా రకాలే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   17 Nov 2023 3:46 AM GMT
రెడ్  బనానా  మూడు వారాలు కంటిన్యూగా తింటే...?
X

భారత్ లో అత్యంత విరివిగా.. ఉన్నంతలో కాస్త చవకగా దొరికే పండ్లలో అరటి పండు కూడా ఒకటి! ఇక రెగ్యులర్ గా కనిపించే అరటిపండ్లలో చాలా రకాలే ఉన్నాయి. ఇందులో భాగంగా అమృతపానీ, చక్రకేళి, బొంత, పచ్చ అరటిపళ్లు, ఎర్ర అరటిపళ్లు మొదలైనవి ఉంటాయి. ఈ క్రమంలో రెడ్ బనానా తింటే ఎన్నో లాభాలు ఉన్నాయని చెబుతున్నారు!

అవును... కేలరీలు కాస్త ఎక్కువగా ఉండే ఎర్ర అరటిపండ్లను తీసుకుంటే చర్మ సమస్యల నుంచి మొదలు సంతానలేమి, నీరసం, కిడ్నీల్లో రాళ్ళు, దంత సమస్యల పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారు. ఇదే సమయంలో మెరుగైన కంటి చూపుకు కూడా ఈ ఎర్ర అరటిపండ్లు ఎంతో సహాయం చేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు!

సంతానలేమి సమస్యకు చెక్!:

ఇటీవల కాలంలో చిన్న వయసులోనే సంతానోత్పత్తి సమస్యలు చాలానే ఉన్నాయనేది తెలిసిన విషయమే! మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో పాటు మరికొన్ని సమస్యలతో సంతానలేమి సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. అయితే.. ఈ ఎర్ర అరటిపండుని కాస్త రెగ్యులర్ గా కనీసం మూడు వారాల పాటు తింటే సంతానోత్పత్తి పెరుగడంతోపాటు.. అంగస్తంభన సమస్య కూడా దూరమవుతుందని చెబుతున్నారు!

కిడ్నీల్లో రాళ్ళకు పరిష్కారం!:

ఇటీవల కాలంలో నీరు తక్కువగా తాగుతుంటారని.. ఫలితంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి అదొక కారణం అని చెబుతుంటారు! ఈ సమయంలో ఇప్పటికే కిడ్నీల్లో రాళ్ళ సమస్యతో బాధపడేవారు దీనిని తింటే ఆ సమస్య నుంచి వచ్చే ఇబ్బందులు తగ్గుతాయని అంటున్నారు.

చర్మ సమస్యలు తగ్గుతాయి!:

శీతాకాలంలో ప్రధానంగా స్కిన్ బాగా డ్రై అయిపోతుంటుంది.. ఈ సమయంలో ఈ సమస్యతోపాటు దద్దుర్లు, సోరియాసిస్ వంటి ఎన్నో చర్మ సమస్యలను తగ్గించడానికి ఈ ఎర్ర అరటిపండ్లు ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఇదే సమయంలో దీన్ని స్కిన్ పై అప్లై చేయడం వల్ల సోరియాసిస్ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు!

కంటిచూపు మెరుగవుతుంది!:

ఈ రోజుల్లో వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా వచ్చే కంటి చూపు లోపం సమస్య ఒకటి! ఫలితంగా చిన్న పిల్లలు కూడా పెద్ద పెద్ద కళ్ళద్దాలతో కనిపిస్తున్నారు. ఇక వయసుపెరిగే కొద్దీ కంటిశుక్లాల సమస్య కామన్ అయిపోయిన పరిస్థితి. ఈ సమయంలో కంటి ఆరోగ్యం మెరుగ్గా మారేందుకు ఈ ఎర్ర అరటిపళ్లు తినడం మంచిదని చెబుతున్నారు.

దంత సమస్యలు దూరం!:

ఎర్ర అరటిపండులో విటమిన్స్, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో బలహీనమైన చిగుళ్ళు వంటి దంత సంబంధిత సమస్యలు దూరమవుతాయని అంటున్నారు. ఈ పండుని రెగ్యులర్ గా తీసుకుంటే నోటి దుర్వాసనతో పాటు అన్ని దంత సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు!

అలా అని ఒ కరోజో, రెండు రోజులో తిని ఫలితం కోసం ఆలోచించకుండా... కనీసం మూడు వారలపాటు రెగ్యులర్ గా ఈ రెడ్ బనానాను తీసుకుంటే కచ్చితంగా పైన చెప్పుకున్న సమస్యలకు మెరుగైన ఫలితాలు దక్కే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు!