Begin typing your search above and press return to search.

మగాడ్ని దెబ్బ తీసే ప్లాస్టిక్.. షాకింగ్ నిజాలు వెల్లడి

మగాడి ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టే సత్తా ప్లాస్టిక్ కు ఉందన్న కొత్త నిజాన్ని తాజాగా జరిపిన పరిశోధన స్పష్టం చేస్తోంది

By:  Tupaki Desk   |   13 Sep 2023 7:58 AM GMT
మగాడ్ని దెబ్బ తీసే ప్లాస్టిక్.. షాకింగ్ నిజాలు వెల్లడి
X

మగాడి ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టే సత్తా ప్లాస్టిక్ కు ఉందన్న కొత్త నిజాన్ని తాజాగా జరిపిన పరిశోధన స్పష్టం చేస్తోంది. ప్లాస్టిక్ తయారీలో వినియోగించే బిస్ ఫినాల్ ఏ బీపీఏ కెమికల్ ప్రభావం మగాడి మీద ఉంటుందన్న షాకింగ్ నిజాన్ని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో గుర్తించారు. మగాడి శరీరంలో ప్లాస్టిక్ చేరితే సంతాన సమస్యలు తలెత్తుతున్నాయని జాతీయ పోషకాహార సంస్థ వార్నింగ్ ఇచ్చింది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ప్లాస్టిక్ లో నిల్వ ఉంచిన ఫుడ్ కు దూరంగా ఉండాలని చెప్పింది.

ఫుడ్ ద్వారా గర్భిణులకు బీపీఏ వెళితే.. వారికి పుట్టే మగ సంతానానికి పెద్దయ్యాక వీర్యంలోని నాణ్యత తక్కువయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. గర్భం దాల్చిన ఎలుకల్ని రెండు జట్లుగా విభజించారు. అందులో ఒక జట్టుకు బీపీఏతో ముడిపడి ఉన్న ఫుడ్ ను పెట్టగా.. మరో జట్టుకు నార్మల్ ఫుడ్ ను అందించారు. బిస్ ఫినాల్ కు దూరంగా ఉండే ఫుడ్ తిన్న ఎలుకల సంతానంలో వీర్య నాణ్యత బాగుండగా.. అందుకు భిన్నంగా బిస్ ఫినాల్ కు దగ్గరగా ఉండే ఫుడ్ పెట్టినట్లుగా పేర్కొన్నారు.

నాలుగు నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు బీపీఏ ఆహారాన్ని తీసుకున్న ఎలుకలకు పుట్టిన మగ ఎలుకల వీర్యం ఉత్పత్తిలో నాణ్యతా లోపాలు ఉన్నట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాల్ని సైంటిస్టు సంజయ్ బసక్ తెలిపారు. పిండ దశలోనే ఎదుగుదలపై ఈ రసాయనం ప్రభావాన్ని చూపినట్లుగా తేల్చారు. ప్లాస్టిక్ ప్లేట్లు.. ఆహారాన్ని తీసుకెళ్లేందుకు వాడే ప్లాస్టిక్ బాక్సులు.. తాగునీరు బాటిళ్ల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని.. వాటికి వీలైనంత దూరంగా ఉండాలన్న హెచ్చరిక జారీ చేవారు. ముఖ్యంగా గర్భం దాల్చే మహిళలు.. గర్భం దాల్చిన వారు కూడా ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలన్న సూచన చేశారు.