Begin typing your search above and press return to search.

మీకు తెలుసా .. జాజికాయ ఉపయోగాలు

యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ పొడిని రోజూ చిటికెడు తీసుకుంటే అనేక లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   21 May 2024 12:30 AM GMT
మీకు తెలుసా .. జాజికాయ ఉపయోగాలు
X

మనం వంటలలో ఉపయోగించే సుగంధద్రవ్యాలలో జాజికాయ కూడా ఒకటి. దీన్ని పాన్ తయారీలో కూడా వాడతారు. యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ పొడిని రోజూ చిటికెడు తీసుకుంటే అనేక లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జాజికాయ పొడి రోజూ ఓ చిటికెడు తీసుకుంటే బరువు ఈజీగా తగ్గవచ్చట.

రోజులో ఏదో ఒక సమయంలో చిటికెడు పొడిని గోరువెచ్చని నీరు లేదా పాలలో కలిపి తీసుకోవాలని, ఇది శరీరంలో టాక్సిన్లను తొలగించి జీవక్రియ పెరగడానికి సహాయపడే జీర్ణ ఎంజైమ్ లను అందిస్తుందని చెబుతున్నారు. ఈ కారణంగా జీర్ణక్రియ బాగా జరిగి బరువు తగ్గడంలో సహాయపడుతుందట. తీసుకోవడానికి చిటికెడే అయినా దీంట్లో పైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. దీన్ని తీసుకుంటే కడుపు నిండుగా ఉన్న ఫీల్ కలిగి బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.

నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారికి రాత్రి పడుకునే ముందు చిటికెడు జాజికాయ పొడిని గ్లాసుడు పాలలో వేసి తాగితే నిద్ర బాగా పడుతుంది. అధికశాతం మంది బరువు పెరగడానికి ముఖ్య కారణం ఒత్తిడి. శరీర కణాలు ఒత్తిడికి గురైనప్పుడు బరువు పెరగడం జరుగుతుంది. జాజికాయలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఒత్తిడి స్థాయిలను అదుపులో ఉంచడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఆక్సీరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే జాజికాయ ప్రయోజనాలను కలిగించినప్పటికీ దీన్ని చిటికెడుకు మించి తీసుకుంటే మాత్రం దుష్ప్రభావాలు కూడా ఉంటాయని చెబుతున్నారు.