Begin typing your search above and press return to search.

పెయిన్ కిల్లర్ అధిక డోసుల పైన కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పెయిన్ కిల్లర్స్ వాడకానికి సంబంధించి అధిక డోసుల విషయంలో నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Desk   |   1 Jan 2026 3:54 AM IST
పెయిన్ కిల్లర్ అధిక డోసుల పైన కేంద్రం కీలక నిర్ణయం
X

కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పెయిన్ కిల్లర్స్ వాడకానికి సంబంధించి అధిక డోసుల విషయంలో నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ పెయిన్ కిల్లర్ మందుగా ఉన్న నిమెసులైడ్ ఉత్పత్తి మీద అలాగే అమ్మకాల మీద కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆంక్షలు విధించింది.

తక్షణం అమలులోకి :

వంద 100 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ నిమెసులైడ్ ని మందులలో తయారీకి ఉపయోగించేదానికి అలాగే అమ్మకానికి పంపిణీకి కూడా నిషేధం తక్షణం అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక గెజిట్ నోటిఫికేషన్‌లో ఈ విషయం పేర్కొంది. డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డుతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది. అలాగే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940 లోని సెక్షన్ 26 కింద నిషేధించినట్లు పేర్కొంది.

ప్రమాదం కలిగిస్తాయి :

నిమెసులైడ్ కలిగి నోటి నుంచి వాడే అన్ని రకాలైన మందుల వాడకం మనుషుల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అని పేర్కొంది. అందుకే ఈ విధంగా ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉందని భావించి ఈ చర్య తీసుకున్నట్లుగా వెల్లడించింది. అంతే కాకుండా నిమెసులైడ్ మందుకు సురక్షితమైన ప్రత్యామ్నాయాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని కూడా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిమెసులైడ్ అనేది ఒక నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధంగా ఉంది. దీనిని తీవ్రమైన నొప్పి చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ప్రజారోగ్యం కోసమే :

ప్రజలకు భద్రతా పరమైన ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా కేంద్రం వెల్లడించింది. దీని మీద ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందని అంటున్నారు. మొత్తం మీద కొత్త ఏడాది మొదలవుతూనే ప్రజా రోగ్యం మీద కేంద్రం ఈ తరహా కీలక నిర్ణయం తీసుకోవడం మీద అంతా చర్చించుకుంటున్నారు. ఇది మేలు చేసే నిర్ణయంగా కూడా పేర్కొంటున్నారు.