Begin typing your search above and press return to search.

వైట్ లంగ్ సిండ్రోం... ప్రపంచానికి కొత్త టెన్షన్ లక్షణాలివే!

కోవిడ్ అల్లకల్లోలం అనంతరం వైరస్ పేరు చెబితే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. పైగా ఆ వైరస్, ఆ బాక్టీరియా లక్షణాలు చైనాలో మొదలయ్యాయని అంటే ఇక చెప్పే పనేలేదు.

By:  Tupaki Desk   |   2 Dec 2023 12:27 PM GMT
వైట్  లంగ్  సిండ్రోం...  ప్రపంచానికి కొత్త టెన్షన్  లక్షణాలివే!
X

కోవిడ్ అల్లకల్లోలం అనంతరం వైరస్ పేరు చెబితే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. పైగా ఆ వైరస్, ఆ బాక్టీరియా లక్షణాలు చైనాలో మొదలయ్యాయని అంటే ఇక చెప్పే పనేలేదు. నాడు కరోనా వైరస్ సృష్టించిన అలజడిని గుర్తుకు తెచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త వ్యాధి చైనాలో ఉద్భవించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై డబ్ల్యూ. హెచ్.ఓ. ఇంకా అలర్ట్స్ జారీ చేయనప్పటికీ... పలు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

అవును... కరోనా ఎఫెక్ట్ నుంచి ఇంకా తేరుకోని దేశాలు చాలానే ఉన్నాయని చెబుతుండగా తాజాగా చైనాలో మరో కొత్త వ్యాధి ఉద్భవించడం చర్చనీయాంశంగా మారింది. ఈ కొత్త వ్యాదికి ప్రధాన కారణం ఒకరకమైన బ్యాక్టీరియా అని తేలింది. శ్వాసకోస సంబంధిత వ్యాది అయిన న్యూమోనియా వ్యాధిని మరింత తీవ్రంగా వ్యాప్తి చేసేలా ఈ బాక్టీరియా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారని తెలుస్తుంది.

ఈ సమయంలో... చైనాలో ఉద్భవించిన ఈ వ్యాధి అమెరికా, డెన్మార్క్, నెదర్లాండ్స్‌ కు వ్యాపించినట్లు తెలుస్తోంది. దీంతో... చైనాకు రాకపోకలు నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను కోరాయి రిపబ్లికన్ సెనెటర్లు! ఇదే సమయంలో... ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) చర్యలు తీసుకునేదాకా ఎదురుచూడకూడదని లేఖలో సెనేటర్లు.. బైడెన్ కు సూచించారు. ఆ స్థాయిలో పలు దేశాలు ముందు జాగ్రత్త చరలు తీసుకుంటున్నాయి.

మరోపక్క ఈ వ్యాదికి "వైట్ లంగ్ సిండ్రోం" అని నామకరణం చేశారు. ఈ వ్యాధి ఎక్కువగా 3 నుంచి 8 ఏళ్ల వయసుగల పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. ఇది ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినప్పటికీ.. యాంటీ బయాటిక్స్‌ తో పోరాడే శక్తిని కలిగి లేదని చెబుతున్నారు. ఇప్పటికే చైనాలో వందల సంఖ్యలో పిల్లలు ఈ వ్యాది బారిన పడ్డారని అంటున్నారు.

ఇదే సమయంలో నెదర్లాండ్స్, స్వీడన్‌ లో కూడా చిన్నపిల్లలకు న్యుమోనియా తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోందని బాధపడుతున్నారు. అదేవిధంగా... డెన్మార్క్‌ లోని చిన్నపిల్లల్లో న్యుమోనియా కేసులు అధికంగా నమోదవడమే కాకుండా.. అంటు వ్యాధి స్థాయికి చేరుకుంటున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే సమయంలో అమెరికాలో కూడా అనారోగ్యం బారిన పడి ఆసుపత్రుల్లో చేరే చిన్న పిల్లల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ నివేదిక ప్రకారం.. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారు చైనాతో కమ్యూనికేషన్‌ లో ఉన్నారని.. దేశంలో ఇటీవలి శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలకు ఒక బ్యాక్టీరియా కారణమని గుర్తించారని తెలుస్తుంది.

వైట్ లంగ్ సిండ్రోం లక్షణాలు:

జ్వరం

దగ్గు

ఛాతీ నొప్పి

శ్వాస ఆడకపోవడం

అలసట