Begin typing your search above and press return to search.

శుక్రకణాల్లో మైక్రో ప్లాస్టిక్... తెరపైకి సంచలన విషయాలు!

ఇప్పటికే మనిషి శరీరంలో రక్తంలోకి చేరుకున్న ప్లాస్టిక్ సూక్ష కణాలు... ఇప్పుడు మనిషి శుక్రకణాల్లోనూ గుర్తించినట్లు తాజాగా పరిశోధకులు వెల్లడించారు.

By:  Tupaki Desk   |   14 March 2024 6:30 AM GMT
శుక్రకణాల్లో మైక్రో ప్లాస్టిక్... తెరపైకి సంచలన విషయాలు!
X

ప్లాస్టిక్ వాడకం ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుందని ఇప్పటికే పలుమార్లు శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడున్న ప్లాస్టిక్ వాడకం ఇదే స్థాయిలో కంటిన్యూ అయితే... దృవాల వద్ద మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగే ప్రమాదం ఉందని.. ఫలితంగా సముద్రతీర ప్రాంతాన్ని కలిగిన పలు ప్రాంతాలు కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు. ఈ సమయంలో ఈ ఎఫెక్ట్ శుక్రకణాలపైనా పడుతుందని చెబుతున్నారు.

అవును... పర్యావరణంలో భారీస్థాయిలో ప్లాస్టిక్ వ్యర్థాలు పడేస్తుండటంతో.. మైక్రోప్లాస్టిక్ లు ఇప్పుడు ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం నుంచి లోతైన మహా సముద్రాల వరకూ మొత్తం భూగ్రహాన్ని కలుషితం చేస్తున్న పరిస్థితి నెలకొంది! ఈ క్రమంలో ఆహారం, నీరు, గాలి పీల్చడం ద్వారా చిన్న చిన్న కణాలను ప్రజలు గ్రహిస్తున్నారని ఇప్పటికే పలు పరిశోధనలు వెల్లడించాయి. ఈ క్రమంలో పిల్లలు పెద్దల రక్తం, మలంలో మైక్రో ప్లాస్టిక్స్ కనుగొనబడ్డాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఇదే క్రమంలో పురుషుల సంతానోత్పత్తిపై ప్లాస్టిక్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని.. ఇదే సమయంలో క్యాన్సర్, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో తాజాగా ఈ విషయంలో విస్తుబోయే విషయాలను వెల్లడించిన శాస్త్రవేత్తలు... సూక్ష్మ రూపంలో గాలిలో చేరుతున్న వ్యర్థాలు గాలి, నీరు, ఆహారం ద్వార శరీరంలోకి చేరుతున్నాయని వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా వీటి ఆనవాళ్లను శుక్రకణాల్లోనూ గుర్తించినట్లు తెలిపారు.

ఇప్పటికే మనిషి శరీరంలో రక్తంలోకి చేరుకున్న ప్లాస్టిక్ సూక్ష కణాలు... ఇప్పుడు మనిషి శుక్రకణాల్లోనూ గుర్తించినట్లు తాజాగా పరిశోధకులు వెల్లడించారు. ఇవి సంతానోత్పత్తిపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు.

కాగా... గతంలో సుమారు 22 మంది వ్యక్తుల నుంచి రక్తనమూనాలను సేకరించిన శాస్త్రవేత్తలు విస్తుపోయే విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... వారి నుంచి సేకరించిన రక్త నమునాలల్లోని సగం నమూనాలు ప్లాస్టిక్ ని కలిగి ఉన్నాయని తెలిపారు. ఇవి సాధారణంగా పానియాల సీసాలలో ఉపయోగిస్తారని వెల్లడించారు. అంటే.. మనిషి రక్తంలోకి డ్రింక్స్ తాగే సీసాల నుంచి చేరుకుని ఉండొచ్చన్నమాట!

ఇదే సమయంలో వాటిలో మూడోవంతు రక్తనమూనాలు పాలీస్టెరిన్ ను కలిగి ఉన్నాయని తెలిపారు. ఇవి ఆహారం, ఇతర ఉత్పత్తులను ప్యాకేజింగ్ కి వాడతారని తెలిపారు. ఇదే క్రమంలో... రక్తనమూనాలలోని నాలుగింట ఒక వంతు పాలిథిలీన్ ను కలిగి ఉందని.. దీంతో ప్లాస్టిక్ బ్యాగులను తయారు చేస్తారని వెల్లడించారు. అంటే... ఆయా కారణాలతో అవి మనిషి రక్తంలోకి ప్రవేశిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో తాజాగా అవి శుక్రకణాల్లోనూ కనిపించినట్లు తెలిపారు.