Begin typing your search above and press return to search.

మానవ మెదడులోనే దిక్సూచి ఉంటుంది తెలుసా?

మానవ మెదడు ఒక అద్భుతం. దీంతో ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నాడు. ఎన్నో కనుగొంటున్నారు

By:  Tupaki Desk   |   13 May 2024 5:30 PM GMT
మానవ మెదడులోనే దిక్సూచి ఉంటుంది తెలుసా?
X

మానవ మెదడు ఒక అద్భుతం. దీంతో ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నాడు. ఎన్నో కనుగొంటున్నారు. ఫలితంగా పనులు చేయడంలో కష్టాలను దూరం చేసుకుంటున్నారు. మానవ మెదడులో యంత్రాంగం ఉంటుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అది న్యూరల్ కంపాస్ లాగా పనిచేస్తుందని వివరించారు. పార్కిన్ సన్స్, అల్జీమర్స్ లాంటి వ్యాధుల గురించి తెలుసుకోవడానికి ఈ పరిశోధన దోహదం చేస్తుందని చెబుతున్నారు.

ఒక్కోసారి మనం దక్కులు, మార్గనిర్దేశనం విషయంలో కంగారు పడుతుంటాం. ఎక్కడకు ఎలా వెళ్లాలనే విషయంలో తడబాటు పడుతుంటాం. పక్షులు, జంతువులకు దిక్కుల గురించి అవగాహన ఉంటుంది. అందుకే అవి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యాలను చేరుకుంటాయి. ఎంత దూరంలో ఉన్న తాము వచ్చిన ప్రాంతాన్ని సులభంగా గుర్తు పట్టడం వాటి ప్రత్యేకత.

పక్షులు, ఎలుకలు, గబ్బిలాల్లో న్యూరల్ సర్క్యూటరీ ఉండటం వల్ల వాటికి దిక్కుల గుర్తింపులో ఇబ్బంది ఉండదు. మానవ మెదడులో కూడా ఇలాంటి యంత్రాంగం ఉంటుంది. దీని కోసం 52 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసుకుని పరిశోధన జరిపారు. కంప్యూటర్ తెరలపై వెలువడిన మార్గదర్శకాలకు అనుగుణంగా తలలను తిప్పాలని సూచించారు.

మూర్చ వ్యాధి ఉన్న 10 మంది మెదడులోని విద్యుత్ సంకేతాలను పరిశీలించారు. వారి మెదడులో దిక్కుకు సంబంధించిన సంకేతాలను గుర్తించారు. తల తిప్పడానికి ముందే బుర్రలో ప్రత్యక్షమైందని తెలుసుకున్నారు. దీన్ని గుర్తించడం వల్ల మెదడు పనితీరు తెలుసుకునే అవకాశం ఏర్పడిందని తెలిపారు. ఇలా మానవ మెదడు పనితీరు గురించి పలు విషయాలు కనుగొన్నారు.