Begin typing your search above and press return to search.

ఆరోగ్య రంగంలో ప్రపంచానికి భారత్ బాస్.. కారణాలు ఇవే..

భారత్ విశ్వగురువని మనందరికీ తెలిసిందే కదా.. కానీ విశ్వానికి ప్రాణదాత అని ఎంత మందికి తెలుసు.

By:  Tupaki Desk   |   14 Aug 2025 12:16 PM IST
ఆరోగ్య రంగంలో ప్రపంచానికి భారత్ బాస్.. కారణాలు ఇవే..
X

భారత్ విశ్వగురువని మనందరికీ తెలిసిందే కదా.. కానీ విశ్వానికి ప్రాణదాత అని ఎంత మందికి తెలుసు. భారత్ ఫార్మారంగంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం. పారాసెటమాల్ నుంచి పెద్ద పెద్ద వ్యాధులకు సంబంధించి మందులను తయారు చేయాలంటే భారత్ కే సాధ్యం. వ్యాధులను నివారించే ఔషధాలను ఏ దేశం కనుక్కున్నా అంతిమంగా భారత్ లోనే వాటి తయారీ జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. రీసెంట్ గా కోవిడ్ వ్యా్ప్తి సమయంలో పారాసెటమాల్ మాత్ర నుంచి వ్యాక్సిన్ వరకు మనమే ప్రపంచానికి సప్లయ్ చేశాం. పైగా బీద దేశాలకు సైతం ఫ్రీగా అందించాం. అందుకే భారత్ ప్రాణదాతగా అవతరించింది. భారత్ ఫార్మారంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఇవి 30.4 బిలియన్ డాలర్ల (2,65,870 కోట్ల రూపాయలు)ను దాట వేశాయి. కేవలం మందులను తయారు చేసే దేశమే కాకుండా నాణ్యత, నవ్యత విషయంలో ప్రపంచ ఆరోగ్య రంగంలో కీలక దేశంగా మారిపోయింది. అధునాతన సామర్థ్యం, వేగం, నాణ్యత లాంటివి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2023-2024లో 27.852 బిలియన్ డాలర్లతో కంపేర్ చేస్తే 2024-2025లో 9.39 శాతం ఎగుమతులు పెరిగాయి. ఫార్మాస్యుటికల్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది.

వ్యాధి ఏదైనా మందులు ఇక్కడే..

వ్యాధి ఏదైనా వ్యాక్సిన్ తయారవ్వాలంటే అది భారత్ లోనే. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ 60 శాతానికి పైగా భారతే సరఫరా చేస్తుందంటే సందేహం లేదు. 200కు పైగా దేశాలకు తక్కువ ధరకు ఔషధాలను అందించి వారి ప్రాణాలు నిలబెడుతుందంటే అది భారత్ మాత్రమేనని గర్వంగా చెప్పాలి.

ప్రభుత్వాల ముందు చూపు ధోరణే కారణం..

ప్రభుత్వాల ముందు చూపు ధోరణి కూడా ఔషధ రంగంలో భారత్ కు సర్వోన్నత స్థానం కల్పిస్తున్నాయి. భారత్-ఈఎఫ్టీఏ ఒప్పందంతో యూరోపియన్ మార్కెట్ లోకి బయోమిల్లర్స్ తో పాటు ఇతర ఔషధాలు ప్రవేశించాయి. ఇదే కాకుండా ఉత్పత్తి ఆదారిత ప్రోత్సహాక పథకాలను భారత్ తీసుకువచ్చింది. దీని ద్వారా ఔషధాలలో వాడే ముడిపదార్థాలను దేశీయంగా ఉప్పత్తి చేసే వీలు కలిగింది.

ఇక సుంకాల విషయానికి వస్తే..

అమెరికా ట్రేడ్ ఎక్స్ పాన్షన్ యాక్ట్ 1962లోని సెక్షన్ 232 కింద భారత్ కు చెందిన మందుల ఎగుమతిపై సుంకాలకు మినహాయింపు వచ్చింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా వాసులకు భారత్ ఔషధాలు సరసమైన ధరల్లో లభిస్తున్నాయి. ఇటీవల ట్రంప్ వేసిన టారీఫ్ లతో జనరిక్ ఔషధాలు వినియోగించే 40 శాతం మంది అమెరికన్స్ పై భారం పడనుంది.

అమెరికా అతిపెద్ద మార్కెట్..

ఇప్పటి వరకు భారత ఔషధ ఎగుమతులను పరిశీలిస్తే అమెరికా పెద్ద మార్కెట్. ఆఫ్రికా 14 శాతం, లాటిన్ అమెరికా 11 శాతం, కామన్ వెల్త్ దేశాలకు 8 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఇది అమెరికాపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు సాయం చేస్తుందని ఫార్మాస్యుటికల్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెగ్జిల్‌) చైర్మన్ నమిత్‌ జోషి చెప్పారు.

మరిన్ని పెట్టబడులు అవసరం..

పెరుగుతున్న జనాభా.. విస్తరిస్తున్న సాంకేతికత ఆధారంగా మరిన్ని పెట్టుబడులు రావాలి. ఆరోగ్యం రంగంలో కూడా పరిశోధనలు, ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ ఆధారిత మందుల ఆవిష్కరణ, డిజిటల్ హెల్త్ సాకేంతికత వంటి వాటిల్లో పెట్టుబడులు చాలా ముమని ఫార్మెగ్జిల్ భావిస్తుందని తెలిపారు.