Begin typing your search above and press return to search.

కొత్తగా మహారాష్ట్రలో 45, ఢిల్లీలో 23.. పెరుగుతున్న కరోనా

2020లో ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మళ్లీ మెల్లగా విస్తరిస్తోంది. అందుకే నిరంతరం పెరుగుతున్న కేసులు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   24 May 2025 1:10 PM IST
COVID-19 Resurgence: India Records Surge in JN.1 Variant
X

2020లో ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మళ్లీ మెల్లగా విస్తరిస్తోంది. అందుకే నిరంతరం పెరుగుతున్న కేసులు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కోవిడ్-19 కొత్త వేరియంట్ JN.1 కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్త కేసుల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అడ్వైజరీ (హెచ్చరికలు) జారీ చేసింది. ఆసుపత్రులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.

ఈ రాష్ట్రాల్లో JN.1 వేరియంట్ కేసులు:

* మహారాష్ట్ర: గత 24 గంటల్లో ఒక్క మహారాష్ట్రలోనే 45 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ముంబై 35, పుణె 4, కొల్హాపూర్ 2, రాయ్ గఢ్ 2, లాతూర్ 1, ఠాణే 1 నుంచి వచ్చాయి. జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 6,819 మందికి కోవిడ్ టెస్టులు చేయగా, 210 మందికి పాజిటివ్ వచ్చింది. ముంబైలో మొత్తం 183 మంది రోగులలో 81 మంది కోలుకున్నారు, మిగిలిన వారికి తేలికపాటి లక్షణాలు ఉన్నాయి.

* కర్ణాటక: మే 23న బెంగళూరులో తొమ్మిది నెలల చిన్నారికి కోవిడ్-19 సోకినట్లు గుర్తించారు.

* తెలంగాణ: తెలంగాణలో కోవిడ్-19 కొత్త కేసు నమోదైంది.

* ఉత్తరప్రదేశ్ (ఘజియాబాద్): ఘజియాబాద్‌లో కోవిడ్-19కు సంబంధించిన నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి.

* ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కూడా కోవిడ్ కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రాజధానిలో ఇప్పటివరకు 23 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ఆరోగ్య మంత్రి పంకజ్ సింగ్ పరిస్థితిని సమీక్షించి, ఆరోగ్య శాఖను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

* కేరళ: మే నెలలో కేరళలో ఇప్పటివరకు 273 కేసులు నమోదయ్యాయి. ఇది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ. అందుకే ఇక్కడ అప్రమత్తత, నిఘా పెంచాలని ఆదేశించారు.

JN.1 లక్షణాలు ఇవే:

భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కరోనా మళ్లీ వేగంగా పెరుగుతోంది. థాయ్‌లాండ్, చైనా, హాంకాంగ్ , సింగపూర్‌లలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఈసారి కరోనా ఈ కొత్త వేరియంట్ JN.1 ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది.

JN.1 వేరియంట్ లక్షణాలు:

* ముక్కు కారడం (ముక్కు దిబ్బడ)

* దగ్గు

* తలనొప్పి

* జ్వరం

* కొన్ని సందర్భాలలో వాసన కోల్పోవడం

* ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.