టైప్ 2 డయాబెటిస్ మొయిన్ విలన్ ను గుర్తించిన ఐఐటీ బాంబే
షుగర్ జబ్బుకు సంబంధించి కీలక అంశాన్ని ఐఐటీ బాంబే నిర్వహించిన పరిశోధన గుర్తించింది.
By: Tupaki Desk | 2 July 2025 10:43 AM ISTషుగర్ జబ్బుకు సంబంధించి కీలక అంశాన్ని ఐఐటీ బాంబే నిర్వహించిన పరిశోధన గుర్తించింది. మాయదారి టైప్ 2 డయాబెటిస్ కు మూల కారణాన్ని తాజాగా గుర్తించారు. మనిషి శరీరంలో అత్యధికంగా ఉండే కొల్లాజెన్ అనే ప్రోటీన్ క్లోమగ్రంధికి నష్టం కలిగించే అమైలిన యాగ్రిగేషన్ అనే ప్రక్రియతోనే టైప్ 2 డయాబెటిస్ కు దారి తీస్తుందని గుర్తించారు.
టైప 2 డయాబెటిస్ బారిన పడిన వారిలో క్లోమ గ్రంధి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతుంది. మనిషి శరీర కణాలపై ఇన్సులిన్ ప్రభావం చూపకపోయినా.. రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతుంది. శరీరంలో క్లోమ గ్రంధి నుంచి ఉద్భవించే ఇన్సులిన్ భోజన అనంతరం రక్తంలో చక్కెర పరిమాణం పెరగకుండా నిరోధించే అమైలిన్ అనే హర్మోన్ ను కూడా ఉత్పత్తి చేస్తుందన్న విషయాన్ని గుర్తించారు.
మనిషి శరీరంలోని కొల్లాజెన్ 1 అనే ప్రోటీన్ అమైలిన్ పేరుకుపోవటానికి కారణమై ఇన్సులిన్ ఉత్పత్తి చేసే క్లోమగ్రంధిలోని బీటా కణాల్ని దెబ్బ తీస్తుంది. ఈ స్థితిలో అమైలిన్ విషతుల్యమవుతుంది. ఈ పరిణామాల కారణంగా రక్తంలోని చక్కెర పరిమాణాన్ని నియంత్రించే సామర్థ్యాన్ని కోల్పోతుందన్న విషయాన్ని ఐఐటీ బాంబే నిర్వహించిన అధ్యయనం గుర్తించింది.
అంతేకాదు.. అమైలిన్.. కొల్లాజెన్ లు ఒకదానిపై మరొకటి ఏ విధంగా ప్రభావం చూపుతాయన్నది అధ్యయనం చేసేందుకు వీలుగా క్రయో ఎలక్ట్రాన్ మెక్రోస్కోపీని డెవలప్ చేస్తున్నారు. తాజాగా నిర్వహించిన అధ్యయనం కారణంగా డయాబెటిస్ ను నియంత్రించేందుకు కొత్త మార్గాల్ని గుర్తించినట్లు అవుతుందని చెప్పక తప్పదు.