Begin typing your search above and press return to search.

మనిషి చనిపోయే సందర్భంలో మెదడు ఆలోచిస్తుందా?

మరణిస్తున్న వ్యక్తి మెదడులో అనుకోకుండా ఇలాంటి తరంగాలు ప్రభావితం అవుతాయి. మెదడులో తరంగాల రికార్డు చేయాలని భావించకున్నా అనుకోకుండా మెదడు చర్యలను గుర్తించారు.

By:  Tupaki Desk   |   3 April 2024 8:54 AM GMT
మనిషి చనిపోయే సందర్భంలో మెదడు ఆలోచిస్తుందా?
X

మనిషి జీవితంలో పుట్టుక, చావు మనిషి చేతిలో ఉండవు. ఒక బతుకు మాత్రమే మన చేతిలో ఉంటుంది. వాన రాకడ ప్రాణం పోకడ తెలియదని అందుకే అంటారు. ఏ మనిషి ఎప్పుడు చనిపోతాడో ఎవరికి తెలియదు. కానీ చనిపోయే ముందు మన మెదడులో జరిగే సంకేతాలు మాత్రం మనకు తెలుస్తాయి. మనిషి చివరి క్షణాల్లో ఎలాంటి ఆలోచనలు చేస్తాడు? ఎలాంటి కలలు కంటాడనే విషయాలు మన శాస్త్రవేత్తలు గుర్తించారు. 87 ఏళ్ల వ్యక్తి చనిపోయే ముందు అతడి మెదడులో జరిగిన తరంగాలను పరిశీలించారు.

మూర్చ వ్యాధితో బాధపడే రోగి చనిపోవడానికి ముందు అతడి మెదడు పనితీరును గమనించారు. అతడు చనిపోవడానికి ముందు గుండెపోటు వచ్చినట్లు గుర్తించారు. కలలు కంటున్నప్పుడు ఏ విషయాలు గుర్తు చేసుకుంటున్నాడో మెదడులో అలాంటి తరంగాలు వచ్చాయి. 30 సెకన్ల ముందు అతడి మెదడును పరిశీలించారు. చివరి క్షణాల్లో అతడి జీవితంలో ముఖ్యమై క్షణాలను గుర్తు చేసుకున్నాడు.

మరణిస్తున్న వ్యక్తి మెదడులో అనుకోకుండా ఇలాంటి తరంగాలు ప్రభావితం అవుతాయి. మెదడులో తరంగాల రికార్డు చేయాలని భావించకున్నా అనుకోకుండా మెదడు చర్యలను గుర్తించారు. ఆఖరి సమయంలో మనిషి తన జీవితంలో ఎదురైన మధుర క్షణాలను జ్ణాపకం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ ఒక్కో వ్యక్తిలో ఒకోలా ఉండొచ్చని చెబుతున్నారు.

మెదడుకు రక్త సరఫరా నిలిచిపోవడానికి 30 సెకన్ల ముందు ఏకాగ్రత పెట్టడం, కలలు కనడం, మధుర క్షణాలు గుర్తుకు చేసుకోవడం లాంటి చర్యలు జరుగుతాయి. మెదడులో తరంగాలు ఎప్పుడు జనిస్తాయో అప్పుడే ఉత్పత్తవ్వడం గుర్తించారు. తరంగాలు 30 సెకన్ల పాటు కనిపిస్తాయి. తరువాత గుండె కొట్టుకోవడ ఆగిపోతుంది. అదే మరణం అని గుర్తుంచుకోవాలి.

ఇలా మనిషి మెదడు చివరి క్షణంలో జరిగే తరంగాలను గుర్తించడంతో మనిషి తన జీవితంలో గుర్తుండిపోయే మధుర క్షణాలను గుర్తు చేసుకుంటారని తెలుస్తోంది. మనిషి జీవితంలో ఎదురయ్యే సంఘటనలను నెమరు వేసుకుంటారు. దీంతో మనిషి మెదడులో నిక్షిప్తమై ఉన్న మరపురాని సన్నివేషాలను ఓ సారి గుర్తు చేసుకుని సంతోష పడతారని తెలుస్తోంది.